యాపిల్ ఫోన్ పని చేసేది మూడేళ్లేనా?

Update: 2016-04-18 17:30 GMT
ఇవాల్టి రోజున ఫోన్ కొన్న ఏడాదికే పాతది అయిపోవటం.. కొత్తదాని మీద మోజు పెరగటం మామూలైంది. గతంలో ఏ వస్తువను అంత త్వరగా వదిలేయని వారు సైతం.. ఫోన్ విషయంలో ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ కావటం కనిపిస్తుంది. అయితే.. వేలాది రూపాయిలు పోసి కొనే ఐఫోన్ లాంటి ఖరీదైన ఫోన్ ని నాలుగైదేళ్లు అయినా వినియోగించుకోరా? అని ఫీలైతే తప్పులో కాలేసినట్లే.

ఎందుకంటే.. జనాలు అనుకోవటం సంగతి తర్వాత.. యాపిల్ కంపెనీ సైతం అంతకాలం తన ఫోన్ ని వాడే అవకాశం లేదని చెప్పటం విశేషం. తాజాగా యాపిల్ ఫోన్లు.. ఇతర ఉపకరణాల లైఫ్ టైం గురించి ప్రస్తావించిన ఫోర్బ్స్ డాట్ కామ్ ఫోన్లు మూడేళ్లు.. టీవీలు.. గడియారాలు మాత్రం నాలుగేళ్లు వాటి లైఫ్ టైమ్ గా పేర్కొనటం గమనార్హం.

పాతవాటి ఓఎస్ లను అప్ గ్రేడ్ చేసుకునే వీలు లేకుండా చేయటం.. విడిభాగాలు అందుబాటులో ఉండకుండా చూడటం ద్వారా యాపిల్ తన ఉత్పత్తులకు లైఫ్ టైం నిర్దేశించిందని చెబుతున్నారు. వేలాది రూపాయిలు పెట్టి కొనే ఫోను మూడేళ్లకు మించి వాడే వీల్లేదా? అయినా.. ఒక ఫోన్ ని మూడేళ్లకు మించి వాడే వారున్నారా..?
Tags:    

Similar News