విదేశీ పర్యటనల్ని పెద్దగా చేయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రాజెక్టుల కోసం.. పనుల్ని పూర్తి చేసేందుకు అదే పనిగా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టినట్లుగా కూడా కనిపించరు. అయినప్పటికీ.. తెలంగాణకు భారీ ప్రాజెక్టులు దక్కుతున్న పరిస్థితి. మొన్నటికి మొన్న గూగుల్ సంస్థ.. హైదరాబాద్ లో భారీ సొంత ఆఫీసును ఏర్పాటు చేయటానికి ముందుకు రావటం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మరో ఐటీ దిగ్గజం భాగ్యనగరికి రానుండటం విశేషం. ప్రఖ్యాత యాపిల్ సంస్థ హైదరాబాద్ లో భారీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భాబిస్తోంది. దీంతో.. 4500 మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇంతకీ హైదరాబాద్ లో యాపిల్ ఏం చేయనుందన్నది ఆసక్తికరంగా మారింది. గూగుల్ మాప్స్ మాదిరే యాపిల్ సైతం తన మొబైల్.. టాబ్లెట్స్.. మాక్ లలో మాప్స్ తయారు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి అమెరికా కాకుండా మిగిలిన ప్రాంతాల్లో సరైన ప్రదేశం కోసం పలు పరిశీలనలు జరిపిన అనంతరం.. హైదరాబాద్ ను ఎంపిక చేసుకుంటూ తాజాగా నిర్ణయం తీసుకుంది. నాలుగు నెలల్లో ఇన్నోవేషన్ కేంద్రం స్టార్ట్ చేసి.. ఈ ఏడాది చివరకు మ్యాప్ పనుల్ని షురూ చేస్తుందని చెబుతున్నారు.
యాపిల్ సంస్థ కోసం గచ్చిబౌలిలోని తిష్ మాన్ స్పెయర్ ఐటీ ప్రత్యేక ఆర్థిక మండలిలో 2.5లక్షల చదరపు అడుగుల్లో యాపిల్ తన ఆఫీసును స్టార్ట్ చేస్తుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు కానీ మొదలైతే.. ఇప్పటికే ప్రపంచ ఐటీ చిత్రపటంలో కనిపించే హైదరాబాద్ మరోసారి వెలిగిపోవటం ఖాయం. తెలంగాణ నుంచి కదలని కేసీఆర్.. అత్యుత్తమ కంపెనీల్ని హైదరాబాద్ కు తీసుకురావటంలో సక్సెస్ కావటం గమనార్హం.