దేశంలో కరోనా మహమ్మారి ఫోర్త్ వేవ్ మొదలవ్వబోతోందనేందుకు సంకేతాలు కనబడుతున్నాయా ? అంటే అవుననే అంటున్నారు వైద్య నిపుణులు. కరోనా వైరస్ కేసుల వ్యాప్తిలో కీలకమైన రీప్రొడక్టివ్ వాల్యూ (ఆర్-వాల్యూ) శాస్త్రజ్ఞులను, వైద్య నిపుణులను భయపెడుతోంది. మూడు నెలల్లో ఆర్ వాల్యూ 1 దాటడమే వీళ్ళల్లో టెన్షన్ పెంచేస్తోంది. కోవిడ్ ఇన్ఫెక్షన్ పెరుగుదలను ఆర్-ఫ్యాక్టర్ ద్వారా అంచనా వేస్తారు.
ఈ ఫ్యాక్టర్ 1 లోపుంటేనే వైరస్ వ్యాప్తి అదుపులో ఉన్నట్లు లెక్క. అదే ఫ్యాక్టర్ 1 దాటిందంటే మాత్రం వ్యాప్తి పెరిగిపోతున్నట్లే లెక్క. ఫ్యాక్టర్ 1 దాటింది ప్రమాద ఘంటికలు మొదలైనట్లే అనుకోవాలి.
ఏప్రిల్ మొదటివారంలో 0.93 గా ఉన్న ఈ వాల్యూ మూడో వారానికి 1.07 దాటినట్లు చెన్నైలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ ప్రకటించింది. దీంతోనే నాలుగో వేవ్ రాబోతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి శాస్త్రవేత్తలు, వైద్య నిపుణుల్లో.
వాల్యూ 1 దాటడానికి ఢిల్లీలో పెరుగుతున్న కేసులతో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, కర్నాటకలో పెరుగుతున్న కేసులు కూడా కారణమవుతున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ, యూపీలో ప్రస్తుతం ఆర్ వాల్యూ 2గా నమోదైతే, ప్రధాన నగరాలైన ముంబయ్, చెన్నై, బెంగుళూలో 1 దాటింది. మరికొన్ని నగరాల నుండి ఇంకా అవసరమైన సమాచారం రాలేదు. ఫ్యాక్టర్ 1 దాటితే అర్ధమేమిటంటే ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తినుండి కచ్చితంగా మరోవ్యక్తికి సోకుతుందని.
దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2 వేలు దాటాయి. గడచిన 24 గంటల్లో దేశం మొత్తంమీద 4.21 లక్షల మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయిస్తే 2067 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణైంది.
అత్యధికంగా ఢిల్లీలో 632 కేసులు, కేరళలో 488 నమోదయ్యాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హరియానా, మహారాష్ట్ర, మిజోరం రాష్ట్రాలు కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. ఫోర్త్ వేవ్ అంటు మొదలైతే ఎంత ఉదృతంగా ఉంటుందో ఎవరు చెప్పలేకపోతున్నారు.