ప్రస్తుత ప్రపంచంలో ఏకైక అగ్ర రాజ్యం అమెరికాతో పోటీ పడుతూ ప్రపంచ ఆధిపత్యం కోసం ఉవ్విళ్లూరుతోంది.. చైనా. విస్తరణ కాంక్షతో సామ్రాజ్యవాదంతో రగిలిపోతోంది.. ఆ దేశం. తన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటితోనూ ఏదో రూపంలో కయ్యాలు పెట్టుకుంటోంది.. చైనా. తన అమేయ సైనిక శక్తితో ఏకంగా అమెరికాకే సవాళ్లు విసురుతోంది. అయితే ఇప్పట్లో చైనాకు ప్రపంచ ఆధిపత్యం దక్కదని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుతం చైనా ఆర్థిక పరిస్థితి బాలేదని.. ఆర్థికంగా ఆ దేశం కుదేలవుతోందని అంటున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం చైనా కొంప కొల్లేరు చేసిందని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే చైనా స్థూల జాతీయోత్పత్తిలో రియల్ ఎస్టేట్ రంగం వాటా 29 శాతం ఉందని చెబుతున్నారు.
1970ల తర్వాత చైనాలో పట్టణీకరణ రాకెట్ వేగంతో దూసుకుపోయింది. దీంతో పట్టణాలు, నగరాలు బాగా పెరిగాయి. దీంతో భారీ సంఖ్యలో గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ పట్టణాలకు రావడం మొదలుపెట్టారు. 1970 నుంచి చూసుకుంటే ఈ 52 ఏళ్లలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస వచ్చే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం చైనా జనాభాలో పట్టణ జనాభా శాతం 64 శాతం ఉండటం గమనార్హం. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 36 శాతం మాత్రమే నివసిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు పోటెత్తడంతో కోటికి పైగా జనాభా ఉన్న నగరాల సంఖ్య అక్కడ 10కి చేరింది. దీంతో ఆ జనాభాను క్యాష్ చేసుకోవడానికి రియల్ ఎస్టేట్ సంస్థలు భారీ ఎత్తున నివాస సముదాయాలను నిర్మించాయి. మరోవైపు రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి భారీ ఎత్తున చైనా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది.
అయితే గత రెండేళ్లు కరోనాతో చైనా తల్లడిల్లిన సంగతి తెలిసిందే. కరోనా పుట్టింది కూడా చైనాలోనే కావడం గమనార్హం. ఇప్పటికీ అక్కడ కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో జీరో కోవిడ్ లక్ష్యంగా పలు నగరాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు అమలవుతున్నాయి. ఈ కారణాలతో ప్రజల కొనుగోలు శక్తి భారీగా పడిపోయింది. దీంతో కొత్త ఇళ్ల కొనుగోలుకు ప్రజలెవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
దేశ జనాభాలో 64 శాతం పట్టణాల్లోనే నివసిస్తుండటంతో రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి వచ్చే ఆదాయంపైనే చైనా ప్రభుత్వం ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. చైనా స్థూల జాతీయోత్పత్తిలో 29 శాతం రియల్ ఎస్టేట్ రంగం నుంచే వస్తోంది.
అయితే కోవిడ్‌తో రెండేల్లపాటు రియల్ ఎస్టేట్‌రంగం అక్కడ తీవ్ర ఒడిదుడుకులకు లోనయింది. ప్రజల ఆదాయం దెబ్బతిని ఇళ్లను కొనేవారు లేకుండా పోయారు. దీంతో రియల్ ఎస్టేట్ సంస్థలు నిర్మించిన లక్షలాది ఇళ్లు కొనేవారు లేక దెయ్యాల కొంపల్లా ఉండిపోతున్నాయి.
ఇలా రియల్ ఎస్టేట్ సంస్థలు ఆయా నగరాల్లో పెద్ద ఎత్తున నిర్మించిన ఇళ్లు ఖాళీగానే ఉండిపోతున్నాయి. దీంతో ఇప్పుడు వాటిని ఘోస్ట్ సిటీస్ అని పిలుస్తున్నారు. ప్రజలెవరూ తమ దగ్గర డబ్బులు లేక వాటిని కొనుగోలు చేయడం లేదు.. అందుకే వాటిని దెయ్యాల నగరాలుగా పిలుస్తున్నారు. అయితే నిజంగా అక్కడ దయ్యాలు లేవు. ప్రజలెవరూ అక్కడ లేకపోవడంతో దయ్యాల నగరాలని వాటిని వ్యవహరిస్తున్నారు.
ఇలా చైనాలోని దెయ్యాల నగరాల్లో నిర్మించిన ఆకాశహర్మ్యాల్లో కనీసం 20 శాతం ఇళ్లు ఖాళీగా ఉన్నాయని చెబుతున్నారు..ఈ ఇళ్లను పంచిపెడితే 9 కోట్ల మందికి ఇళ్లు అందించవచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా జర్మనీ, ఫ్రాన్స్, కెనడా వంటి దేశాల్లోని మొత్తం జనాభాకు సరిపోయినన్ని ఇళ్లు చైనాలో ఉన్నాయని అంటున్నారు.
ప్రజలెవరూ కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. అందుకే కోట్లాది ఇళ్లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయంటున్నారు. ఈ ఇళ్ల నిర్మాణానికి రియల్ ఎస్టేట్ కంపెనీలు వేలాది బిలియన్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టారు. వెంచర్లు మధ్యలోనే ఆగిపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి పన్నుల రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండిపడింది. దీంతో ప్రభుత్వం కూడా కంగారు పడుతోంది. అగ్ర రాజ్యంగా ఎదిగిపోవాలని కలలు కన్న ఆ దేశంలో ఆర్థిక పరిస్థితి చాలా భయంకరంగా ఉందని చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.