ఐరాస చీప్ బరిలో భారత సంతతి మహిళ

Update: 2021-02-14 12:09 GMT
ఐక్యరాజ్యసమితి అత్యున్నత పదవికి భారత సంతతి మహిళ పోటీపడుతున్నారు. ఐరాస జనరల్ సెక్రటరీ పదవికి తాను పోటీ పడుతున్నట్లు అరోరా ఆకాంక్ష (34) వెల్లడించారు. త్వరలో జరిగే సెక్రటరీ జనరల్ ఎన్నికల బరిలో ఉంటానని ఆకాంక్ష తెలిపారు.

భారత సంతతికి చెందిన ఆరోరా ఆకాంక్ష ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) కింద ఆడిట్ కో-ఆర్డినేటర్ గా సేవలందిస్తున్నారు.

ఈ క్రమంలో సెక్రటరీ జనరల్ పదవికి తాను పోటీపడనున్నట్లు వెల్లడిస్తూ ‘ఆరోరాఫర్ ఎస్జీ’ అనే హ్యాష్ ట్యాగ్ తో ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ వీడియోను సైతం షేర్ చేశారు.

ప్రస్తుతం ఐరాస సెక్రటరీ జనర‌ల్‌గా ఆంటోనియో గుటెర్రస్ (71) బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31తో ఆయన పదవీ కాలం ముగియనుంది. తదుపరి ఎస్‌జీ పదవీకాలం జనవరి 1, 2022 నుంచి ప్రారంభం కానుంది. అయితే తాను రెండో దఫా ఆ బాధ్యతలు నిర్వహించేందుకు సుముఖంగా ఉన్నట్లు గుటెర్రస్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఆకాంక్ష ఈ ప్రకటన చేశారు.. ఐక్యరాజ్య సమితి 75 ఏళ్ల ఐరాస చరిత్రలో ఇంతవరకు ఒక మహిళ కూడా ఆ పదవిని చేపట్టలేదు. ఒకవేళ ఆకాంక్ష ఈ పదవిని చేపడితే.. చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలిగా రికార్డు సృష్టిస్తారు.

భారత్‌కు చెందిన ఆకాంక్ష.. కెనెడియన్‌ పాస్‌పోర్టుపై.. ఓవర్సీస్‌ సిటిజన్‌షిప్‌ ఆఫ్‌ ఇండియాగా కొనసాగుతున్నారు.




Tags:    

Similar News