తమిళ్ బిగ్ బాస్ ఫేమ్ ఓవియా హెలెన్ మరోసారి ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. సోషల్ మీడియాలో సింగిల్ కామెంట్ తో హాట్ డిస్కషన్ కు తెరతీశారు. గతంలో ప్రధాని మోడీ తమిళనాడు పర్యటన సందర్భంగా ‘గో బ్యాక్ మోడీ’ అంటూ పోస్టు చేయడం.. ఆమెపై కేసు నమోదు కావడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా.. సోషల్ మీడియాలో మరోసారి ఫైర్ అయ్యారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ పలుమార్లు బాహాటంగానే స్పందించారు హెలెన్. ఇప్పుడు మరోసారి ఇండైరెక్ట్ గా కామెంట్ చేశారు. Is this democracy or democrazy ??? అనే ట్వీట్ చేశారు. దీనికి #ArrestMeToo అనే హ్యాష్ ట్యాగ్ ను సైతం జతచేయడం గమనార్హం. దీంతో.. ఈ ట్వీట్ ఒక్కసారిగా వైరల్ అయ్యింది.
అయితే.. హెలెన్ ట్వీట్ ఏ విషయానికి సంబంధించింది అన్నప్పుడు.. రెండు అంశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య ఢిల్లీలో ప్రధానికి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించిన వారిలో 25 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దేశంలో ఇవ్వాల్సిన వ్యాక్సిన్లు విదేశాలకు ఎందుకు పంపించారని అందులో ప్రశ్నించారు. ఈ చర్యకు నిరసనగానే ఈ ట్వీట్ చేసినట్టు చెబుతున్నారు.
మరోవైపు.. ఇటీవల రాహుల్ గాంధీ #ArrestMeToo అనే హ్యాష్ ట్యాగ్ తో కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ హ్యాష్ ట్యాగ్ కు మద్దతుగానే హెలెన్ ట్వీట్ చేసిందని కూడా చర్చించుకుంటున్నారు. అయితే.. హెలెన్ ధైర్యంగా ప్రశ్నిస్తోందని పలువురు కామెంట్ చేస్తున్నారు.