ఫస్ట్ టైం.. డిజిటల్ బడ్జెట్

Update: 2017-02-01 04:59 GMT
టెక్నాలజీని ఫుల్లుగా వాడుకోవడంలో ఇంతవరకు మోడీని మించిన ప్రధాన మంత్రి లేరు... ఆయన ప్రధాని పీఠం ఎక్కడానికి వేసి తొలి అడుగుల నుంచి అంతటా డిజిటల్ ముద్ర కనిపిస్తుంది. సోషల్ మీడియా - విజువల్ టెక్నాలజీలను వాడుకుని మోడీ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించి భారతీయులకు బొమ్మ చూపించి తన బుట్టలో వేసుకున్నారు. ఆ తరువాత కూడా ఆయన డిజిటల్ జోరు సాగుతోనే ఉంది. తాజాగా  కేంద్ర బడ్జెట్ ను కూడా తొలిసారిగా 100 శాతం డిజిటల్ రూపంలో చేశారు.  
    
కేంద్ర బ‌డ్జెట్‌ పూర్తిగా టెక్ హంగులతో పార్లమెంటు ముందుకు వచ్చింది. సాధార‌ణంగా బడ్జెట్  కాపీల‌ను ప్రింట్ చేసి 788  మంది ఎంపీల‌కు - మీడియా ప్ర‌తినిధుల‌కు ఇస్తారు.  కార్పొరేట్ కంపెనీలు - పెద్ద సంస్థ‌లు వంటివి కావాలంటే కాపీని కొనుక్కునేందుకు అందుబాటులో ఉంచుతారు. కానీ  ఈ  సంవ‌త్స‌రం తొలిసారిగా  పేప‌ర్‌ లెస్ బ‌డ్జెట్‌ ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ నిర్ణ‌యించింది. మీడియాకు - ప్ర‌జ‌ల‌కు ప్రింటెడ్ కాపీలు అందుబాటులో ఉండ‌వు.  పెన్‌ డ్రైవ్‌ లు లేదా హార్డ్ కాపీల ద్వారా ఎలాంటి బ‌డ్జెట్ డాక్యుమెంట్ల‌ను యాక్సెస్ చేయ‌లేరు.

ఎన్ ఐసీ చలవే..

బ‌డ్జెట్ వివ‌రాలు తెలుసుకోవాల‌నుకుంటే ఆన్‌ లైన్‌ లో చూడాలి. నేష‌న‌ల్ ఇన్‌ఫ‌ర్మేటిక్స్ సెంట‌ర్ వెబ్‌ సైట్‌ లో యూనియ‌న్ బ‌డ్జెట్ ఇన్ఫ‌ర్మేష‌న్ సిస్టం (యూబీఐఎస్‌)లోకి వెళితే బడ్జెట్‌కు సంబంధించిన స‌మ‌స్త స‌మాచారం దొరుకుతుంది. కావాలంటే డౌన్లోడ్ చేసుకోవ‌చ్చు.

 వివిధ కేంద్ర ప్ర‌భుత్వ శాఖ‌లు పంపిన బ‌డ్జెట్ అంచ‌నాలు - రివైజ్డ్ అంచ‌నాలు - బ‌డ్జెట్ వాల్యూమ్ 1 - 2  యాన్యువ‌ల్ ఫైనాన్షియ‌ల్ స్టేట్‌ మెంట్  - బ‌డ్జెట్ స‌మ‌గ్ర స్వ‌రూపం (ఎట్ ఏ గ్లాన్స్‌) వంటివ‌న్నీ ఈ వెబ్‌ సైట్‌ లో దొరుకుతాయి. బ‌డ్జెట్ పూర్త‌య్యాక ఈ స‌మాచారం అంతా ఆన్‌ లైన్‌ లో - ఆఫ్‌ లైన్‌ లో కూడా అందుబాటులో ఉంచేందుకు గ‌వ‌ర్న‌మెంట్ ఏర్పాట్లు చేసింది.   

గో గ్రీన్ ఇనీషియేటివ్‌ లో భాగంగా గ‌త రెండేళ్లుగా పార్ల‌మెంట్ వ్య‌వ‌హారాల్లో కాగితం వినియోగాన్ని 60 శాతం వ‌ర‌కు త‌గ్గించారు. కేంద్ర బ‌డ్జెట్‌ తోపాటు అంత‌కు ముందు రోజు విడుద‌ల చేసే ఆర్థిక స‌ర్వేను కూడా సాధ్య‌మైన‌న్ని త‌క్కువ కాపీలు ప్రింట్ చేయించాల‌ని  ఆర్థిక వ్య‌వ‌హారాల‌పై ఏర్పాటైన పార్ల‌మెంట్ స్టాండింగ్ క‌మిష‌న్  సిఫార్సు చేసింది. పేప‌ర్‌ లెస్ బ‌డ్జెట్ వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి మేలే జ‌రుగుతుంది. బ‌డ్జెట్‌ - కేంద్ర ఆర్థిక స‌ర్వేల‌ను వంద‌లు - వేల సంఖ్య‌లో ప్రింట్ చేయ‌డానికి బోల్డంత కాగితం అవ‌స‌ర‌మ‌య్యేది.  ఇప్పుడు ఇదంతా ఆదా అవుతున్న‌ట్లే.

టెక్నిక‌ల్‌ గా ముంద‌డుగు

డిజిటల్ ఇండియా ల‌క్ష్యంతో ముందుకెళుతున్న కే్ంద్ర ప్ర‌భుత్వం డీమానిటైజేష‌న్ నేప‌థ్యంలో అంద‌ర్నీ ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ల వైపుకు మ‌ళ్లేలా ఆలోచింప‌జేసింది.  ఇందుకోసం తానే ఇనీషియేష‌న్ తీసుకుని బీమ్ యాప్‌ను రిలీజ్ చేసింది. ఆధార్‌తో లింక్ చేసిన పేమెంట్ సిస్టంను కూడా తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.  ఇప్పుడు బ‌డ్జెట్‌ను కూడా పేప‌ర్‌లెస్ చేయ‌డం ద్వారా ద‌శాబ్దాల నాటి పాత విధానాల‌కు పుల్‌స్టాప్ పెట్టేసి టెక్నాల‌జీ వైపు గ‌వ‌ర్నెన్స్‌ను న‌డిపించ‌డంలో మరో ముందడుగు వేసింది.

ఆ రాష్ట్రంలో తొలిసారి..

హిమాచ‌ల్‌ ప్ర‌దేశ్ దేశంలోనే తొలిసారిగా 2015లో పేప‌ర్‌ లెస్ బ‌డ్జెట్‌ ను ప్ర‌వేశ‌పెట్టింది. కేవలం 10 నుంచి 15  కాపీల‌ను అవి కూడా ఫైలింగ్ కోస‌మే ప్రింట్ చేశారు. దీన్ని చూసి ఢిల్లీ గ‌వ‌ర్న‌మెంట్ కూడా పేప‌ర్‌ లెస్ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది.

జ‌మ్మూ కాశ్మీర్ గ‌వ‌ర్న‌మెంట్ ఈ సంవ‌త్స‌రం నుంచి పేప‌ర్‌ లెస్ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. ఇందుకోసం ఎన్ ఐసీ త‌యారుచేసిన బ‌డ్జెట్ ఎస్టిమేష‌న్ ఎలొకేష‌న్ మేనేజ్‌ మెంట్ సిస్టం (బీమ్స్‌)ను ఎడాప్ట్ చేసుకుంది. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News