జైట్లీ ఎంత కామెడీగా మాట్లాడాడంటే..

Update: 2015-11-09 15:54 GMT
త‌మ‌కు తిరుగులేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే ప్ర‌ధాని మోడీ అండ్ కోకు నితీశ్ త‌న‌దైన శైలిలో.. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్  ఇచ్చిన సంగ‌తి తెలిసిందే బీహార్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో జీవ‌క‌ళ త‌ప్పిన క‌మ‌ల‌నాథులు త‌మ వైఫ‌ల్యాల్ని క‌ప్పిపుచ్చుకుంటూ క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు. లౌకిక కూట‌మిని అంచ‌నా వేయ‌టంలో పొర‌పాటు ప‌డిన‌ట్లుగా చెప్పుకున్న వారు.. పార్టీలో మోడీ త‌ర్వాత అత్యంత కీల‌క‌మైన బాధ్య‌త‌లు చేప‌ట్టే వారిలో ఒక‌రైన అరుణ్‌ జైట్లీ మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా జైట్లీ మాట‌లు చూస్తే.. వెనువెంట‌నే కామెంట్ చేయాల‌నిపించ‌కుండా మాన‌దు.

జైట్లీ మాట‌లకు వెనువెంట‌నే ప్ర‌శ్న‌లు సంధిస్తే ఎలా ఉంటుందంటే..

 జైట్లీ మాట‌: ఓట‌మిని అంగీక‌రిస్తున్నాం. ప్ర‌తిప‌క్షం పాత్ర పోషిస్తాం.

మ‌న‌సు మాట‌: ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత అంత‌కు మించి ఇంకేం అన‌గ‌ల‌రు. ఆ మాట కూడా అన‌కుంటే ప‌రువు పోతుంది క‌దా..!

జైట్లీ మాట‌: రిజ‌ర్వేష‌న్ల‌పై మా వైఖ‌రి స‌రిగానే ఉంది

మ‌న‌సు మాట‌: చూస్తుంటే.. బీహార్ దెబ్బ స‌రిపోన‌ట్లుంది. రిజ‌ర్వేష‌న్ల మీద అడ్డ‌దిడ్డంగా మాట్లాడి ఇంత దూరం తెచ్చుకున్న త‌ర్వాత కూడా తెలివి వ‌చ్చిన‌ట్లు లేదే..?

జైట్లీ: రాజ‌కీయాల్లో గెలుపోట‌ములు స‌హజం

మ‌న‌సు మాట‌: ఓడిన‌ప్పుడు ఆ మాత్రం హుందాత‌నం లేక‌పోతే జ‌నాలు మ‌రింత ఛీ కొట్ట‌టం ఖాయం.

జైట్లీ: ఆర్ ఎస్ ఎస్ చీఫ్ భ‌గ‌వ‌త్ వ్యాఖ్య‌లు మా ఓట‌మి కార‌ణం కాదు

మ‌న‌సు మాట‌: ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మాట‌ల కంటే.. చేత‌లే ఎక్కువ దెబ్బ తీశాయ‌ని బ‌య‌ట‌కు చెబితే.. మొత్తానికే మోసం వ‌స్తుంది క‌దా.

జైట్లీ మాట‌: లౌకిక కూట‌మిలో మూడు పార్టీలు క‌ల‌వ‌టంతో ఓడిపోయాం

మ‌న‌సు మాట‌ : కామెడీ కాకుంటే.. రాజ‌కీయాల‌న్నాక గెలుపు కోసం ఎవ‌రి లెక్క వారిది. గెలుపు కోసం వ్యూహాలు ప‌న్నుతారు కానీ.. ప్ర‌త్య‌ర్థి గెల‌వాల‌ని చేతులు ముడుచుకొని కూర్చోరు క‌దా.

జైట్లీ మాట‌: మ‌హా కూట‌మి బ‌లాన్ని అంచ‌నా వేయ‌టంలో పొర‌పాటు ప‌డ్డాం.

మ‌న‌సు మాట‌: ఇది స‌రైన మాట‌. ఇన్ని మాట‌లు త‌ర్వాత కానీ.. అస‌లుసిస‌లు కార‌ణం బ‌య‌ట‌కు రాలేదు చూశారా. ప్ర‌త్య‌ర్థిని త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌టం అంటే.. ఆత్మ‌విశ్వాసం ఏ రేంజ్ లో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.

జైట్లీ మాట‌: బీహార్ లో క్ష‌డినా.. ఇంత‌కు ముందు మూడు రాష్ట్రాల్లో గెలిచాం.

మ‌న‌సు మాట‌: మ‌రి.. ఢిల్లీ ఓట‌మి సంగ‌తేమంటారు? ఇక‌.. గెలిచామ‌ని చెప్పుకునే మ‌హారాష్ట్ర‌లో వ‌చ్చిన అత్తెస‌రు లెక్కేంటో?అంత‌దాకా ఎందుకు జ‌మ్మూకాశ్మీర్ లో సంకీర్ణం ఉన్నా.. బీజేపీ బ‌ల‌మెంతో ఎవ‌రికి తెలియంది. ఒక ఢిల్లీ లానో.. .ఒక బీహార్ మాదిరో ఘ‌న విజ‌యం సాధించిన పెద్ద రాష్ట్రం పేరు చెబితే బాగుంటుందేమో?

జైట్లీ మాట‌: బీజేపీ నేత‌లు బాధ్య‌త‌గా మాట్లాడాలి

మ‌న‌సు మాట‌: ఇలా ఉత్త మాట‌లు చెప్పే బ‌దులు.. హ‌ద్దులు దాటి మాట్లాడి.. పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే వారిపై ఒక వేటు వ‌స్తే.. దెబ్బ‌కు అంతా సెట్ అవుతుంది. అప్పుడ‌ప్పుడు టాప్ ఆర్డ‌ర్ లో ఉన్నోళ్లు అదిలించి.. బెదిరించ‌టం.. కాస్త త‌గ్గి.. త‌ర్వాత ఇష్టారాజ్యంగా మాట్లాడ‌టం చూస్తే జైట్లీ తెలివితేట‌లు ఇట్టే తెలిసిపోతాయి.
Tags:    

Similar News