ప్రధానమంత్రి నరేంద్రమోడీకి - ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు మధ్య జరుగుతున్న టామ్ ఆండ్ జెర్రీ వార్ లో ఇంకో అప్ డేట్. మోడీ తన మనసులోని భావాలను ప్రజలకు చేరేవేసేందుకు రేడియో ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి పోటీగా కేజ్రివాల్ సైతం అదే పేరుతో కొత్త కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఇది మోడీకి చురక అంటించేలా ఉండటం విశేషం.
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కర్ణాటక శాఖ ఆధ్వర్యంలో అరవింద్ కేజ్రివాల్ లో మాట్లాడే కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ప్రధానమంత్రి ‘మన్ కీ బాత్’ వంటి ఒకేవైపు ఉపన్యాసాలు కాకుండా ముఖాముఖి చర్చలతో అభిప్రాయాలు పంచుకొనేందుకు ఈ కార్యక్రమాన్ని సిద్ధం చేశారు. ప్రశ్నలు సంధించాలనుకొన్నవారు www.facebook.com/TalkTOAK వేదికగా నుంచి లేదా 011-23392999 నంబరుకు కాల్ చేయాలని, 8130344141 నంబరుకు ఎస్ ఎంఎస్ ద్వారా సంప్రదించాలని ఆప్ ప్రతినిధులు వివరించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలైన తాగునీటి సరఫరా - నాణ్యమైన విద్య - విద్యుత్ వంటి సదుపాయాలు ప్రణాళికబద్ధంగా నెరవేర్చిన ఆప్ రానున్న పంజాబ్ ఎన్నికల్లో దిల్లీ స్థాయి విజయం దిశగా దూసుకుపోగలదని వారు ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి కేవలం తను చెప్పాలనుకున్నది మాత్రమే చెప్తారని కానీ తమ నాయకుడు కేజ్రివాల్ ఆ విధంగా కాదని ఆప్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.