పావు సీఎం చెప్పిన తాజా మాటలు విన్నారా?

Update: 2016-06-25 11:56 GMT
సామాన్యుడిగా తనను తాను చెప్పుకుంటూ భిన్న తరహాలో రాజకీయాలు చేసే అధినేతగా ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను చెప్పొచ్చు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఆయనకు కేంద్రంలోని మోడీ అంటే మా చెడ్డ చిరాకు. ఆయన మీద తనకున్న అసంతృప్తిని కేజ్రీవాల్ దాచి పెట్టుకున్నది లేదు. ఏ చిన్న అవకాశం వచ్చినా ఆయనపై విమర్శలు చేయటం మామూలే. అంతేకాదు.. ఢిల్లీలో తమ పట్టు పెంచుకోవాలని కేజ్రీవాల్ అండ్ కో తో పాటు మోడీ పరివారం నిత్యం ప్రయత్నిస్తుండటంతో ఈ రెండు వర్గాల మధ్య రచ్చ ఒక రేంజ్ లో ఉంటుంది.

తాజాగా తమ ఎమ్మెల్యేను విలేకరుల సమావేశంలో అరెస్ట్ చేయటంపై ఢిల్లీ ముఖ్యమంత్రి రియాక్ట్ అయ్యారు. ఢిల్లీని అర్థ రాష్ట్రమని అన్న ఆయన.. ఆ అర్థ రాజ్యానికి తనను పావు ముఖ్యమంత్రిగా భావిస్తారని చెప్పుకొచ్చారు.  తమను చూసి బీజేపీ నేతలు భయపడతారంటూ వ్యాఖ్యలు చేసిన ఆయన.. ‘‘రాత్రంతా వాళ్లకు మేం కలలోకి వచ్చినట్లు.. మమ్మల్ని చూసి అంత భయపడతారు ఎందుకో?’’ అంటూవ్యంగ్యంగా వ్యాఖ్యలుచేసిన ఆయన.. ప్రధాని మోడీ మీద విమర్శనాస్త్రాలు సంధించారు.

మోడీ విదేశాల్లో ఉన్నంత కాలం ఢిల్లీ బాగానే ఉంటుందని.. ఆయన దేశంలోకి అడుగు పెట్టిన వెంటనే  ఢిల్లీలో అలజడి మొదలవుతుందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన తమ ఎమ్మెల్యేల్ని ప్రధాని మోడీ బెదిరిస్తారని.. వారిపై తప్పుడు కేసులు పెట్టిస్తారంటూ ఆరోపణలు చేసిన ఆయన.. తనదైన వైఖరితో అందరిని భయాందోళనలకు గురి చేస్తారన్నారు. ఢిల్లీలో మోడీ అత్యవసర పరిస్థితిని విధించినట్లుగా ధ్వజమెత్తారు. ఒకవేళ ఆయనే కనుక పావు సీఎం అయితే.. ఆయన్ను చూసి కమలనాథులు అంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు కదా..?
Tags:    

Similar News