బాలీవుడ్లో వారం రోజుల నుంచి ఓ సినిమా గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. ఆ సినిమానే.. నీరజ. 1986లో హైజాక్ అయిన విమానంలో ఉగ్రవాదుల బారి నుంచి ప్రయాణికుల్ని రక్షించడానికి తన ప్రాణాలనే త్యాగం చేసిన నీరజా బానోత్ అనే ఎయిర్ హోస్టెస్ జీవిత కథతో రామ్ మద్వాని తెరకెక్కించిన సినిమా ఇది. విడుదలకు వారం ముందే బాలీవుడ్ సెలబ్రెటీలకు ఓ స్పెషల్ ప్రివ్యూ షో వేయగా.. అది చూసి అందరూ మెస్మరైజ్ అయిపోయారు. అమీర్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి సూపర్ స్టార్లు సినిమా చూసి కదిలిపోయారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సంగతి ట్విట్టర్లోనూ వెల్లడించారు.
ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా చూసి సామాన్య ప్రేక్షకులు కూడా ఇలాగే ఫీలవుతున్నారు. భారమైన హృదయాలతో థియేటర్ నుంచి బయటికి వస్తున్నారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సైతం ఈ సినిమా విపరీతంగా నచ్చేసింది. విడుదలకు రెండు రోజుల ముందే తన సిబ్బందితో కలిసి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారు కేజ్రీవాల్. తాను ఈ మధ్య కాలంలో ఇంత మంచి సినిమా చూడలేదని.. ఎంతో స్ఫూర్తిదాయకంగా, కదిలించేలా సినిమా ఉందని.. పరుల హితం కోసం బతకాలని, అందుకోసం అవసరమైతే ప్రాణాలు కూడా త్యాగం చేయాలని ఈ సినిమా చాటి చెప్పిందని ప్రశంసలు కురిపించారు కేజ్రీవాల్.