సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కీలక అంశమైన అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మధ్యవర్తిత్వ ప్యానెల్ ద్వారా సమస్య పరిష్కరించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు మధ్యవర్తిత్వ ప్యానెల్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ముగ్గురు మధ్యవర్తులతో కూడిన ప్యానెల్ ను సుప్రీంకోర్టు నియమించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఖలీపుల్లా ప్యానెల్ కు ఛైర్మన్ గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా శ్రీ శ్రీ రవిశంకర్ - సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచు ను నియమించింది.
అయితే, ఈ ఎపిసోడ్ పై ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మధ్యవర్తి కమిటీ నుంచి రవిశంకర్‌ను తప్పించాలని ఓవైసీ అభిప్రాయపడ్డారు. గత ఏడాది నవంబర్‌లో ముస్లింలపై రవిశంకర్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు అసద్ అన్నారు. అయోధ్య అంశంపై ముస్లింలు తగాదా మానకుంటే, భారత్ మరో సిరియాలా మారుతుందని రవిశంకర్ ఆరోపించారు. ఆ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ... ప్యానెల్‌లో శ్రీశ్రీ వద్దంటూ అసద్ అన్నారు. శ్రీశ్రీ బదులుగా మరో తటస్థ వ్యక్తిని నియమించాలన్నారు. గతంలో ఈ వివాదంపై శ్రీశ్రీ అనుచిత వ్యాఖ్యలు చేశారని, అలాంటి వ్యక్తులను మధ్యవర్తిగా నియమించడం సరికాదు అని అసద్ అన్నారు.
ఇదిలాఉండగా, మధ్యవర్తిత్వ ప్రక్రియ 4 వారాల్లోగా ప్రారంభించి..8 వారాల్లోగా పూర్తి చేయాలని సీజేఐ రంజన్ గొగోయ్ తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. మధ్యవర్తిత్వ ప్రక్రియ వివాదానికి పరిష్కారానికి ఉపయోగపడొచ్చని బెంఛ్ అభిప్రాయపడింది. స్నేహపూర్వకంగా ఈ వివాదానికి పరిష్కారం దొరికేందుకు ఒక శాతం అవకాశమున్నా..పార్టీలు మధ్యవర్తిత్వానికి వెళ్లాలని సూచనలు చేసింది.