కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ధ్వజమెత్తారు. రాహుల్ కు దమ్ముంటే తనపై పోటీ చేయాలంటూ సవాల్ విసిరారు. దేశవ్యాప్తంగా ఆయన నిర్వహించే సభలకు జనం తమంతట తాముగా రావడం లేదని విమర్శించారు. బీర్లు - బిర్యానీలు పంచి కాంగ్రెస్ నేతలు జనాన్ని రాహుల్ సభలకు తరలిస్తున్నారని ఆరోపించారు.
హైదరాబాద్ పాత బస్తీలో అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం రాత్రి ఎంఐఎం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్ ఎస్ కు తాము మద్దతిస్తున్న సంగతి వాస్తవమేనన్నారు. అయితే - ఆ పార్టీతో అన్ని అంశాల్లో ఏకీభవించడం లేదని స్పష్టం చేశారు. ఎంఐఎం పోటీలో ఉన్న స్థానాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులను ఓడించాల్సిందేనని పిలుపునిచ్చారు. ఎంఐఎం పోటీలో లేని స్థానాల్లో మాత్రమే టీఆర్ ఎస్ కు ఓటెయ్యాలని సూచించారు. టీఆర్ ఎస్ గెలిస్తే ప్రభుత్వం తమ చేతుల్లోనే ఉంటుందన్న వాదనను అసదుద్దీన్ పునరుద్ఘాటించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ - టీడీపీల పొత్తుపై అసదుద్దీన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ రెండు పార్టీలు నిఖా చేసుకున్నాయంటూ ఎద్దేవా చేశారు. ప్రజా కూటమిని ప్రజలు విశ్వసించే అవకాశాలే లేవని ఎద్దేవా చేశారు. తెలంగాణలోనే కాకుండా దేశమంతటా రాహుల్ సభలకు జనం భారీగా వస్తున్నారనే వార్తలు వట్టి మాటలేనని అసదుద్దీన్ అన్నారు. ఆ సభలకు వచ్చేవారు నిజంగా కాంగ్రెస్ ను - రాహుల్ ను నమ్మి వస్తున్నవారు కాదని పేర్కొన్నారు. మద్యం - బిర్యానీ పంపిణీ చేస్తూ కాంగ్రెస్ నేతలు రాహుల్ సభలకు జనాన్ని తరలిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీకి ధమ్ముంటే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తనపై పోటీ చేసి గెలవాలని అసదుద్దీన్ సవాల్ విసిరారు. తనపై పోటీ చేస్తే రాహుల్ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని అన్నారు.