తెలంగాణ నేతలంతా అక్కడి ఎన్నికల్లో ప్రచారం - వ్యూహాల్లో తలమునకలుగా ఉన్న సమయంలో... అక్కడ ఫలితాలపై అందరూ ఉత్కంఠగా చూస్తున్న సమయంలో తెలంగణకు చెందిన కీలక నేత ఒకరు ఏపీలో ఎవరు గెలుస్తారన్నది చెప్పి సంచలనం సృష్టించారు. జాతీయ మీడియా రిపబ్లికన్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆంధ్ర పాలిటిక్సుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తన మిత్రుడు జగన్ స్వీప్ చేస్తారని ఆయన అన్నారు. అక్కడ జగన్ వేవ్ ఉందన్నారు. ఆయన అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్త తీసుకుంటే మొత్తం 25 లోక్ సభ సీట్లనూ వైసీపీ గెలవగలదని ఒవైసీ అన్నారు. ఏపీలో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాదని అన్నారు. ఫైట్ జగన్ - టీడీపీ మధ్యే ఉందని.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీని జగన్ స్వీప్ చేస్తారని ఒవైసీ జోష్యం చెప్పారు.
ఇక తెలంగాణలో తాము కేసీఆర్ కు గులాంలా వ్యవహరిస్తున్నామన్న ఆరోపణలపైనా ఆయన స్పందించారు. కర్నాటకలో కూడా ఎన్నికల ముందు కుమారస్వామిని బీజేపీ మనిషిగా కాంగ్రెస్ ప్రచారం చేసిందని.. కానీ, అక్కడ ఎవరెవరు కలిసి పనిచేస్తున్నారో అందరికీ తెలిసిందేనన్నారు. రాహుల్ తమపై విమర్శలు చేస్తున్నారని.. విమర్శల కంటే ముందు ఆయన వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కనీసం 120 సీట్లు తెచ్చుకుంటే చాలు అంటూ ఎద్దేవా చేశారు.
కేంద్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ కానీ - కాంగ్రెస్ కానీ అధికారంలోకి రావని చెప్పారు. ఈ రెండు పార్టీలు లేకుండా ఒక ప్రత్యామ్నాయ కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. మొత్తానికి తెలంగాణలో కేసీఆర్ - ఏపీలో జగన్ తన మిత్రులన్న విషయాన్నితన మాటల్లో ఆయన చెప్పారు.