కొన్ని విషయాల మీద వెనువెంటనే రియాక్ట్ అయ్యే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. తాజాగా చోటు చేసుకున్న ఒక ఉదంతంపై తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. నిన్న రాత్రి అమర్ నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.
ఉగ్రదాడి వెనుక పాక్ ఉగ్రవాద గ్రూపులు ఉన్నట్లుగా ఆయన మండిపడ్డారు. అమర్ నాథ్ యాత్రను ముగించుకొని తమ తమ గమ్యస్థానాలకు వెళుతున్న భక్తుల బస్సుపై ఉగ్రవాదులు దాడికి తెగబడటం.. ఈ దుర్మార్గ ఘటనలో ఏడుగురు మరణించటం తెలిసిందే.
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లాలో చోటు చేసుకున్న ఉగ్రదాడిపై మజ్లిస్ అధినేత తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉగ్ర ఘటనను తీవ్రంగా ఖండించిన ఓవైసీ.. ఐఎస్.. లష్కర్ దుష్ట పన్నాగాల్ని సాగనీయమన్నారు. దేశం ఐక్యంగా ఉందని.. ఉగ్రవాదుల దాడి అత్యంత హేయమైన చర్యగా తూర్పార పట్టారు. ఉగ్రదాడిపై అసద్ వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.