అచ్చం కేటీఆర్ చెప్పినట్లే చెప్పిన అసద్

Update: 2016-07-02 05:41 GMT
పైకి ఫ్రెండ్స్ గా కనిపించినప్పటికి.. భిన్నధ్రువాలుగా ఉండే నేతలుగా మంత్రి కేటీఆర్.. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీని చెప్పుకోవాలి. ఈ ఇద్దరిలో పోలిక ఏమైనా ఉందంటే.. అది తమ ప్రయోజనాలకు పెద్దపీట వేయటం. రాజకీయంగా తమకు ఏది ప్రయోజనకరంగా ఉంటుందో ఆ అంశాల మీదనే ఎక్కువ దృష్టి పెడుతుంటారు. హైకోర్టు విభజన.. జడ్జిల నియమకాలు.. ఆందోళన సందర్భంగా వేసిన సస్పెన్షన్ వేటు తదితర అంశాలపై తెలంగాణ న్యాయవాదులు సాగిస్తున్న ఉద్యమం ఇప్పుడుపీక్ స్టేజ్ కి చేరింది. రాజకీయ పక్షాలన్ని ఒక తాటి మీదకు తీసుకురావటంతో పాటు.. తానేం చెబుతానో అదే విషయాన్ని తూచా తప్పకుండా చెప్పేలా చేయటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి.

హైకోర్టు విభజన విషయంలో తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆయన.. ఇప్పటికిప్పుడు ఉమ్మడి హైకోర్టును విభజించేలా చర్యలు తీసుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. అందుకే.. హైకోర్టు విభజన అంశంపై అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేసుకోవటనికి సైతం సిద్ధమంటూ సిగ్నల్స్ ఇచ్చి కలకలం రేపటం తెలిసిందే. తాజాగా జరిగిన లాయర్ల మహా ధర్నాకు అన్ని రాజకీయ పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తిట్టిన తిట్టకుండా తట్టేసిన తెలంగాణ నేతలు తీరు ఒకలా ఉంటే.. మజ్లిస్ అధినేత నోటి నుంచి వచ్చిన మాట అందరి దృష్టిని ఆకర్షించింది.

తాజాగా విదేశీ పర్యటనలో ఉన్న కేటీఆర్  హైకోర్టు ఇష్యూ మీద చేసిన ట్వీట్ మాదిరే అసద్ మాటలు సేమ్ టు సేమ్ ఉండటం గమనార్హం. మహా ధర్నాలో ప్రసంగించిన అసదుద్దీన్.. హైటెక్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారని.. హైకోర్టు నిర్మాణంపై దృష్టి పెట్టకపోవటం సబబు కాదని చెప్పుకొచ్చారు. హైకోర్టు విభజన అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తానన్నారు. అసద్ మాట్లాడిన మాటలన్ని ఒక ఎత్తు అయితే.. కేటీఆర్ ట్వీట్ లోని అంశాన్నే అసద్ నోటి నుంచి రావటం తమాషాగా అనిపించట్లేదు..?

Tags:    

Similar News