హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ఎంఐఎం ఆధిపత్యం సుస్పష్టం. ఒవైసీ సోదరులదే అక్కడ రాజ్యం. ఏం జరగాలన్నా వారి అనుమతి ఉండాల్సిందే. ఇక ఎన్నికలొస్తే పాతబస్తీ, ఆ చుట్టుపక్కల్లోని కనీసం 6-7 నియోజకవర్గాలు ఎప్పుడూ ఎంఐఎం ఖాతాలోనే చేరుతుంటాయి. అయితే - ఒవైసీ సోదరులు హైదరాబాద్ లోని ఇతర మతస్థులతోగానీ ఇతర పార్టీలవారితో గానీ సఖ్యతతో ఉండరనే విమర్శలున్నాయి. తమ అధీనంలోని ప్రాంతాన్ని ఎంఐఎం ప్రత్యేక దేశంగా చూస్తుందని - అక్కడ భారతదేశ జెండాను ఎగరనివ్వరని కూడా కొందరు ఆరోపిస్తుంటారు.
ఒవైసీ సోదరులపై ఉన్న ఈ ఆరోపణలనే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ఆదివారం తెలంగాణకు విచ్చేసిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రస్తావించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మజ్లిస్ ఆధిపత్యానికి కళ్లెం వేస్తామన్నారు. ఒవైసీ సోదరులు నిజాం రాజు తరహాలో దేశం విడిచి పారిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
యోగి హెచ్చరికలపై తాజాగా ఒవైసీ సోదరులు స్పందించారు. ఆయనకు దీటుగా బదులిచ్చారు. తాము దేశం విడిచి పెట్టి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. అది బాగానే ఉంది. కానీ - ఒవైసీ సోదరులు స్పందించిన తీరు ఇప్పడు రాజకీయ వర్గాలతోపాటు సామాన్య ప్రజానీకంలోనూ చర్చనీయాంశమవుతోంది. ఒవైసీలు ఇక్కడా మతాన్ని ముడిపెట్టే సమాధానాలివ్వడమే అందుకు కారణం. యోగి హెచ్చరికలపై అసదుద్దీన్ స్పందిస్తూ.. భారత్ తమ తండ్రి ప్రొఫెడ్ ఆడం దేశమని పేర్కొన్నారు. తన మత విశ్వాసం ప్రకారం ప్రాఫెట్ ఆడం పరలోకం నుంచి భూమిపైకి వచ్చిన సమయంలో ఆయన భారతదేశానికి వచ్చారని చెప్పారు. కాబట్టి తామూ ఇక్కడే జీవిస్తామన్నారు.
అయితే - ఒవైసీ ఇక్కడ మతాన్ని ప్రస్తావించడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. భారత్ లోనే ఉండే అధికారం తనకుందని ఒవైసీ చెప్పడం కరెక్టేనని.. దానికి మతపరమైన కోణాన్ని జోడించడం మాత్రం బాగోలేదని వారు చెబుతున్నారు. ఒవైసీకి దేశభక్తి లేదని చెప్పేందుకు ఇదో తార్కాణమని సూచిస్తున్నారు. నీవు ఎలా ఇక్కడ పుట్టి ఇక్కడే జీవిస్తున్నావో మేం కూడా ఇక్కడే పుట్టాం ఇక్కడే జీవిస్తాం ఇక్కడే మరణిస్తామని.. ఇదే తమ జన్మభూమి అని యోగికి ఒవైసీ సోదరులు బదులిచ్చి ఉండాల్సిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.