మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. మొత్తంగా దేశానికి నష్టం జరిగే మాటలు మాట్లాడటానికి ప్రపంచంలో మరే దేశ నాయకుడు మాట్లాడే సాహసం చేయరు. కానీ.. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాత్రం అందుకు భిన్నమైన వారు. ప్రపంచంలో దేశం ఏదైనా సరే.. బలమైన పాలకుడు ఉండాలని కోరుకుంటారే తప్పించి.. బలహీనులు దేశానికి నాయకత్వాన్ని వహించాలని కోరుకోరు. కానీ.. అసద్ మాత్రం అలాంటిది జరగాలని కోరుకోవటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న.
తాను చేసిన వ్యాఖ్యలు.. దేశానికి చేటు చేసేవి కాదన్న సమర్థింపు చేసుకోవచ్చు. కానీ.. అదే మాత్రం పొసగదన్నవిషయాన్ని మర్చిపోకూడదు. చాలా కాలం తర్వాత దేశానికి ప్రధాని మోడీ రూపంలో బలమైన.. అత్యంత శక్తివంతమైన ప్రధాని లభించారని చెప్పాలి. బలహీన ప్రధానికి.. బలమైన ప్రధానికి మధ్య తేడా.. విదేశాలు మన దేశాన్ని చూసే తీరుపై ఆధారపడి ఉంటుంది. ఇవాల్టి రోజున దేశీయంగా మోడీని తిట్టే వారు సైతం.. ఆయన రాజకీయ తీరును తప్పు పట్టే వారు సైతం.. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక పలు దేశాల్లో భారత్ కు.. భారతీయులకు ఇస్తున్న ప్రాధాన్యత.. గౌరవ మర్యాదల విషయంలో వచ్చిన తేడాను స్పష్టంగా ప్రస్తావిస్తున్నారు.
ఇలాంటి వేళ.. అసద్ మాత్రం అందుకు భిన్నంగా దేశానికి బలమైన ప్రధాని కారణంగా ఒరిగిందేమీ లేదని.. బలహీనమైన ప్రధాని మేలుగా అభివర్ణించటం గమనార్హం. దేశానికి ప్రధానమంత్రులుగా వ్యవహరించిన వారిని చూస్తే.. ఇందిరాగాంధీ తర్వాత బలవంతమైన ప్రధానిగా నరేంద్ర మోడీని చెప్పాలి. ఆయన ప్రభుత్వ విధానాల కారణంగా పెట్రోల్.. డీజిల్ ధరలు.. జీఎస్టీ విషయంలో అభ్యంతరాలు కొన్ని వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో రాష్ట్రాల్లో తమ పార్టీ అధికారంలోకి రావటం కోసం గీత దాటుతున్న వైనం కనిపిస్తుంది. కానీ.. అంతర్జాతీయంగా చూసినప్పుడు భారత్ ఇమేజ్ భారీగా పెరగటమే కాదు.. అగ్రరాజ్యాలు సైతం భారత్ కు ఇస్తున్న విలువ.. మర్యాదల విషయంలో భారీ తేడా ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. అంతేకాదు.. మోడీ ప్రభుత్వం మీద ఇప్పటివరకు సరైన స్కాం ఒక్కటి బయటకు రాలేదు. మిగిలిన ప్రభుత్వాలతో పోలిస్తే.. మోడీ సర్కారులో అవినీతి కాస్తంత తక్కువనే చెప్పాలి. కాకుంటే ఇటీవల కాలంలో విపక్షాల విషయంలో ఆయన పార్టీ అనుసరిస్తున్న తప్పుడు పోకడల్ని తప్పు పట్టాల్సిందే.
మోడీని మొనగాడు పాలకుడన్న విషయాన్ని మేం చెప్పట్లేదు. కాకుంటే మోడీ కారణంగా దేశానికి జరిగిన లాభాన్ని.. అదే సమయంలో ఆయన కారణంగా చోటు చేసుకుంటున్న నష్టం గురించి సాపేక్షంగా చూసినప్పుడు మోడీ లాంటి బలమైన నేత కారణంగా దేశానికి మేలు జరిగింది. సుదీర్ఘ కాలంగా ఉన్న చాలా సమస్యలకు పరిష్కారం లభించింది. ఇలాంటివి చూస్తూ కూడా.. దేశానికి బలహీన ప్రధాని ఉండాలని కోరుకోవటం తప్పే అవుతుంది. దేశానికి ఇబ్బంది కలిగించేలా ఉన్న ఓవైసీ మాటలు.. వివాదం అయ్యాక ఆయన సర్ది చెప్పొచ్చు. కానీ.. అలాంటి ఆలోచన కూడా రాకూడదన్న విషయాన్ని అసద్ ఎందుకు మర్చిపోతున్నారు. రాజకీయం కోసం దేశాన్ని సైతం బలి పెట్టేస్తారా? అన్నది ప్రశ్న.