ఎంఐఎం అధినేత - ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటారు. తనదైన శైలిలో రాజకీయాలు చేసే ఓవైసీ తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. గులాబీ దళపతికి అండగా తమ రాజకీయం కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. ప్రత్యేక భేటీలు జరిపి ఆ పార్టీని ఎన్నికల్లో ఒడ్డున పడేయడంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి అసదుద్దీన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తాను జగన్ కు మద్దతు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఏపీ సీఎం - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు తన సొంత రాష్ట్రంలోనే వ్యతిరేకత ఉందనీ..వచ్చే ఎన్నికల్లో ఎంపీ స్థానాలు రెండు కూడా గెలవలేరని జోస్యం చెప్పారు. ఏపీలో తాను ప్రచారం చేస్తే ఎలా వుంటుందో? ఆ ప్రభావం ఎలా ఉంటుందో చంద్రబాబుకు రుచి చూపిస్తాననీ ఓవైసీ కలకలం రేపే కామెంట్లు చేశారు. ఏపీకి వెళ్లి జగన్ కు మద్దతిస్తానని అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేసినా తెలంగాణలో చంద్రబాబు ఫలితాలు సాధించలేకపోయారని అసదుద్దీన్ ఎద్దేవా చేశారు.
కాగా, తెలంగాణ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారంతో అటు గులాబీ బాస్ కేసీఆర్ - ఇటు ఎంఐఎం నేత అసదుద్దీన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీని పరిణామమే తాజా ప్రకటన అని తెలుస్తోంది. ఏపీ ఎన్నికల్లో తాము కూడా వేలు పెడతామనీ కేసీఆర్ - కేటీఆర్ కూడా ప్రకటించటంతో ఏపీ ఎన్నికలు ఊహించినదానికంటే వేడిగా జరుగుతాయనే సంకేతాలు వినిపిస్తున్నాయి.దీనికి తోడుగా తాను జగన్ కు మద్దతిస్తానని అసదుద్దీన్ ప్రకటించండం ఈ హీట్ ను మరింత పెంచింది. ఈ క్రమంలో ఏపీలో 2019లో రానున్న అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ ఎన్నికల కంటే వాడీ వేడీగా జరగడం ఖాయమంటున్నారు.