ఆధ్యాత్మిక గురువుగా వేల సంఖ్యలో ఉన్న అనుచరులతో నీరాజనాలందుకున్న ఆశారాం బాపూ లైంగిక దాడి కేసులో దోషిగా ఖరారు కావడంతో ఒక్కసారి అధఃపాతాళానికి పడిపోయాడు. ఒకప్పుడు పూరి గుడిసెలో తన ఆశ్రమాన్ని ప్రారంభించిన ఆయన నాలుగు దశాబ్దాల వ్యవధిలో దానిని రూ.10వేల కోట్ల విలువైన సామ్రాజ్యంగా విస్తరించి తిరిగి ఊచలు లెక్కబెట్టడమే కాకుండా చచ్చే వరకు జైలులోనే బ్రతకాల్సిన స్థితిని సృష్టించింది. తనను నమ్మి తన ఆశ్రమానికి విద్యాభ్యాసం కోసం కూతురును పంపిన ఓ భక్తుడి నమ్మకాన్ని నిట్టనిలువునా వంచించి, ఆ బాలికపై లైంగికదాడికి ఒడిగట్టిన ఆశారాం బాపు ఇకమీదట చచ్చేవరకూ జైలు ఊచలు లెక్కబెట్టాల్సిందేనని న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది. టీనేజ్ బాలికపై లైంగికదాడికి పాల్పడిన కేసులో సాక్షుల అడ్డు తొలిగించుకొని, విచారణాధికారులను బెదిరింపులకు గురిచేసినప్పటికీ కోర్టు ఆయనను దోషిగా తేల్చింది.
77 ఏళ్ల ఆశారాం బాపూను మరణించే వరకూ జైలులోనే శిక్ష అనుభవించాలని ప్రకటించింది. అదనంగా లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. ఆశారాం అనుచరులు శిల్పి, శరద్‌లకు చెరో 20 ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధించింది. అయితే ఇంత కఠినమైన శిక్షను విధించేందుకు కారణం...ఆశారాం చేసిన నమ్మకద్రోహమే. తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఓ టీనేజ్ బాలిక చేసిన ఫిర్యాదుపై పోలీసులు ఆశారాంను 2013, సెప్టెంబర్ ఒకటిన అరెస్టు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన ఆ బాలిక మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలోగల ఆశారాం ఆశ్రమంలో చదువుకోవడం కోసం వచ్చి చేరింది. 2013, ఆగస్టు 15న రాత్రి ఆశారాం తనను జోధ్‌పూర్ సమీపంలోని మనాయి ప్రాంతంలోగల ఆశ్రమానికి పిలిపించుకొని, లైంగికదాడికి పాల్పడ్డాడని ఆ బాలిక పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు ఆయనను ఇండోర్‌లో అరెస్టు చేసి సెప్టెంబర్ ఒకటిన జోధ్‌పూర్‌కు తీసుకొచ్చారు. 2013 నవంబర్ 6న ఆశారాంతోపాటు మరో నలుగురు సహ నిందితులు శివ, శిల్పి, శరద్, ప్రకాశ్‌లపై చార్జిషీట్ దాఖలు చేశారు. తొలుత జోధ్‌పూర్ జిల్లా, సెషన్స్ కోర్టులో విచారణ జరిపిన ఈ కేసును ఆ తరువాత ఎస్సీ/ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. విచారణ సందర్భంగా బెయిల్ కోసం ఆశారాం సర్వశక్తులూ ఒడ్డాడు. ట్రయల్ కోర్టు ఆరుసార్లు, రాజస్థాన్ హైకోర్టు మూడుసార్లు, సుప్రీంకోర్టు మూడుసార్లు ఆయన బెయిల్ పిటిషన్లను తిరస్కరించాయి. ఈ కేసు విచారణ ప్రారంభమైన అనంతరం గత నాలుగేళ్లలో తొమ్మిది మంది సాక్షులపై దాడులు జరిగాయి. కాగా వీరిలో ముగ్గురు హత్యకు గురయ్యారు.
కాగా, లైంగికదాడికి గురైన బాలిక సంచలన విషయాన్ని వెల్లడించారు. తనను ఏం చదువుతావని అడిగితే సీఏ అవ్వాలని ఉందని చెప్పానని, అప్పుడు ఆశారాం... ఎందరో పేరున్న ఆఫీసర్లే నా కాళ్లు మొక్కుతారని, సీఏ చదివి నువ్వేం చేస్తావని అన్నాడని తెలిపారు. బీఈడీ చేయాలని తనను బెదిరించాడని, అలా చేస్తే అతని పాఠశాలలో తొలుత టీచర్‌ను చేసి ఆ తర్వాత ప్రిన్సిపల్‌ను చేస్తానని చెప్పాడని ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఆశారాం నిర్వాకాలు బయటపడి ఆయన జైలుపాలవడంతో ఆ బాలిక ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రతను కల్పించారు. కేసు విచారణ సమయంలోనే ఆమె కుటుంబానికి బెదిరింపులు ఎదురైన నేపథ్యంలో వారికి ఎటువంటి ముప్పు వాటిల్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. `మాకు న్యాయం జరిగింది. ఈ పోరాటంలో మాకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు` అని లైంగికదాడి బాధితురాలి తండ్రి పేర్కొన్నారు.