కేసీఆర్ పై ఆశా కార్యకర్తల ‘తిట్ల పాట’

Update: 2016-07-07 08:36 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై విమర్శలు చేసేందుకు విపక్షాలు సైతం జంకే పరిస్థితి.  విపక్షాల పరిస్థితే ఇలా ఉంటే.. ఆయన్ను తప్పు పట్టే ధైర్యం ఈ రోజున చేసే పరిస్థితి ఎవరికి లేకుండా పోయిందన్న విమర్శ ఉంది. తన దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకునే ఎవరికైనా సరే.. కోరుకున్న దానికంటే ఎక్కువగా ఇచ్చి పంపే అలవాటున్న కేసీఆర్ కొన్ని అంశాల విషయంలో అస్సలు పట్టనట్లుగా వ్యవహరిస్తుంటారు.

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 63 రోజులుగా ఆశా కార్యకర్తలు నిరవధిక సమ్మెచేస్తున్నారు. వీరికి మద్దతు ఇస్తూ వామపక్షాలు సైతం ఆశాకార్యకర్తలఆందోళనలో పాలు పంచుకుంటున్నారు. అయినప్పటికి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందన లేని పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రిని తీవ్రంగా విమర్శిస్తూ ఆశా కార్యకర్తలు నినాదాలతో పాడుతున్న పాట ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.

ఈ తిట్ల స్లోగన్స్ లాంటి పాటలోని కొన్ని స్లోగన్స్ ను శాంపిల్ గా చూస్తే..

వద్దురా నాయనా.. కేసీఆర్ పాలన

మామాఅల్లుళ్లంతా..... (అభ్యంతరకర మాట).. మంత్రులంతా దొంగలే..

చెట్టు మీది కొంగ.. కేసీఆర్ దొంగ

వద్దురా నాయనా.. కేసీఆర్ పాలన

ఇదేనా ఇదేనా బంగారు తెలంగాణ

బంగారు తెలంగాణ కేసీఆర్ ఆడుతున్న బూటకం

ఆశా గాజులు గల్లుమనే.. కేసీఆర్ గుండె జల్లుమనే..

తెల్ల చీల తెలుపు చూడు.. కేసీఆర్ బలుపు చూడు..

అమ్మలాంటి ఆశపై వద్దంటే యుద్ధమే..

ఎంపీ అమ్మకు కోట్లా?.. ఆశా వాళ్లకు పాట్లా?

వద్దురో నాయనా.. కేసీఆర్ పాలన
Full View


Tags:    

Similar News