ప్రతిరోజూను భిన్నంగా గడపాలి. గుట్టుగా ఎఫైర్లు సాగించాలి. ఎంజాయ్ చేస్తుండాలి.. అని అనుకునేవారు బోలెడంత మంది. అలాంటి వారి ఫాంటసీలు తీర్చేందుకు పిచ్చబోలెడు డేటింగ్ వెబ్ సైట్లు ఉన్నాయి. వాటిలో రిజిష్టర్ అయితే.. పార్టనర్ ను వెతికి పెట్టేందుకు అవసరమైన వేదికను ఏర్పాటు చేయటం లాంటి సేవలు అందిస్తుంటాయి. వీటిల్లో పేరు నమోదు చేసుకునే వారు గుట్టుగా తాము అనుకున్న బతుకును లాగేస్తుంటారు. ఇల్లు.. పెళ్లాం.. మొగుడు.. పిల్లలు లాంటివి ఉన్నా.. అమ్మాయిలు.. అబ్బాయిలు ఆ బంధాలకు తోడుగా ఈ అక్రమ బంధాల పట్ల మక్కువ ప్రదర్శిస్తుంటారు.
ఇలాంటి సేవల్ని అందించే ప్రముఖ డేటింగ్ వెబ్ సైట్లలో మాష్లే మాడిసన్ ఒకటి. ఈ వెబ్ సైట్ నినాదంతోనే ఇదెలాంటి వెబ్ సైట్ అన్నది అర్థమైపోతుంది. జీవితం చిన్నది.. ఓ ఎఫైర్ పెట్టుకోండంటూ ఊరిస్తుంటుంది. 46 దేశాల్లో సేవలు అందించే ఈ వెబ్ సైట్ కు దాదాపు 3కోట్ల మంది సభ్యులు ఉన్నారు. వీరంతా తమ అభిరుచికి తగ్గట్లుగా సెట్ చేసుకుంటారు.
ఈ మధ్యన ఈ వెబ్ సైట్ ను హ్యాక్ చేశారు. భారీ మొత్తాన్ని కోరారు. అయితే.. సదరు వెబ్ సైట్ నో చెప్పేయటంతో కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఈ వెబ్ సైట్ లో రిజిష్టర్ చేసుకున్న 3 కోట్ల మందికి సంబంధించిన సమాచారాన్ని విడతల వారీగా బయటకు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్ మహిళా ఎంపీ ఒకరున్నట్లు సమాచారం బయటకు వచ్చింది. ఇలా సామాన్యుల దగ్గర నుంచి.. ప్రముఖుల వరకూ చాలామందే దీన్లో సభ్యులుగా ఉన్నారు.
ఈ సమాచారం బయటకు రావటంతో.. ఈ అవమానం.. కుటుంబాల్లో చోటు చేసుకునే పరిణామాలతో కొందరు ఆత్మహత్యల బాట పడుతున్నారు. దీంతో.. ఇప్పుడు ఇదో పెద్ద సమస్యగా మారింది. మొత్తం సమాచారం కానీ బయటకు వస్తే.. ఆత్మహత్యల సంఖ్య భారీగా పెరిగే వీలుందని అంచనా వేస్తున్నారు. పరిస్థితి తీవ్రత గుర్తించిన కెనడా సర్కారు అమెరికా ఎఫ్ బీఐను సాయం కోరి.. హ్యాకర్లను గుర్తించే పనిలో పడింది. మరోవైపు సదరు వెబ్ సైట్ కూడా ఈ హ్యాకర్ల సమాచారం అందిస్తే రూ.2.5కోట్లు పారితోషికం ఇస్తామంటూ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. హ్యాకర్లను గుర్తించే పనిలో ఎవరికి వారు ఇలా మునిగిపోతుంటే.. మరోవైపు.. బయటకు వస్తున్న సమాచారంతో కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. దీంతో.. ఈ వెబ్ సైట్ లోని మూడుకోట్ల మంది సభ్యులు ఇప్పుడు నరకయాతన అనుభవిస్తున్నారు. ఎప్పుడు తమ పేరు బయటకు వస్తే.. ఆ పరిస్థితుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాక బుర్ర బద్ధలు కొట్టుకుంటున్నారట. తెచ్చిపెట్టుకున్న సమస్యలంటే ఇవేనేమో.