ఈ మధ్య కాలంలో ఇండిగో ఎయిర్ లైన్స్ పేరు వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇండిగో సిబ్బందిపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారన్న వార్త దేశవ్యాప్తంగా దుమారం రేపింది. రెండు రోజుల క్రితం బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు...ఇండిగో సిబ్బంది తనతో అమర్యాదగా ప్రవర్తించారని ఆరోపించిన సంగతి తెలిసిందే. అక్టోబరు 15న ఢిల్లీ విమానాశ్రయంలో రాజీవ్ కటియాల్ అనే వ్యక్తిపై ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో, కటియాల్ కు ఇండిగో ఎయిర్ లైన్స్ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. కటియాల్ ను స్వయంగా కలిసి ఇండిగో ఎయిర్ లైన్స్ డైరెక్టర్ దాడి ఘటన పట్ల విచారం వ్యక‍్తం చేస్తూ క్షమాపణలు చెప్పారు. ఈ ఘటనకు ప్రధాన కారకుడైన ఉద్యోగిని వెంటనే విధుల్లో నుంచి తొలగిస్తున్నామని ఇండిగో తెలిపింది. అయితే, ఈ ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు బుధవారం స్పందించారు. ప్రయాణికుడు రాజీవ్ కటియాల్ పై దాడిని ఆయన ఖండించారు. ఈ ఘటనపై స్వతంత్ర నివేదిక సమర్పించాలని డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ని ఆదేశించారు. దాడికి పాల్పడ్డ ఇండిగో సిబ్బందిపై చట‍్టపరమైన చర్యలు తీసుకుంటామని అశోక్ గజపతి రాజు చెప్పారు. నాగరిక సమాజంలో ఇటువంటి అనాగరిక చర్యలను ఎంత మాత్రం సహించబోమన్నారు. విచారణ నివేదిక రాగానే ఇండిగో సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే కేంద్ర విమానయాన సహాయ మంత్రి స్పందించారు. ఆ దాడిని ఆయన ఖండించి నివేదిక ఇవ్వాలని ఇండిగోను కోరారు.
అయితే, ఈ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. ప్రయాణికుడిపై దాడి చేసిన ఉద్యోగిని కాకుండా వీడియో తీసిన ఇండిగో ఉద్యోగిని విధుల్లోనుంచి తొలగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ వీడియో తీసినందుకు తనను ఇండిగో అధికారులు తీవ్రంగా ఇబ్బంది పెట్టి విధుల్లో నుంచి తొలగించారని, ఘటనకు కారణమైన ఉద్యోగి ఇంకా విధుల్లోనో కొనసాగుతున్నాడని బాధితుడు మోంతు కార్లా ఆరోపించడం ఆసక్తికరంగా మారింది. ఆ రోజు ఘటనను తానే వీడియో తీశానని, అయితే సోషల్ మీడియాకు లీక్ చేసింది మాత్రం తాను కాదని మీడియాకు చెప్పాడు. ఆ వీడియో తీసిన తర్వాత గొడవపడిన సహోద్యోగి తనకు దానిని పంపమని కోరాడని, సెక్యూరిటీ అసిస్టెంట్ మేనేజర్ దగ్గర ‘ఆధారంగా’ దానిని చూపుతానని చెప్పాడన్నాడు. ఇండిగో అధికారులు తనను పిలిచి జరిగిన ఘటన గురించి అడిగి తెలుసుకున్నారనీ, ఆ వీడియో తమకు పంపమని తన ఫోన్ లో నుంచి డిలీట్ చేశారని చెప్పాడు. అక్టోబర్ 16 మొదలు 30 వరకు ప్రతి రోజూ తీవ్రంగా వేధించారని కార్లా వాపోయాడు. ఆ తర్వాత అక్టోబర్ 30న తనను ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్టు చెప్పారన్నాడు. తాను ఆరేళ్లుగా ఇండిగోలోనే పనిచేస్తున్నానని, తన భార్య గర్భవతి అని చెప్పినా వినలేదన్నాడు. అవసరమైతే సస్పెండ్ చేయమని కోరానని, ఉద్యోగం నుంచి తొలగించవద్దని బతిమాలినా వినలేదన్నాడు. అసలు గొడవకు కారణమైన వ్యక్తిని వదిలేసి, కార్లాను తొలగించిన ఇండిగో పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇండిగో సిబ్బంది పేరు వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తోందని, ఆ సిబ్బంది తీరు సరిగా లేదని నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా ఆ సంస్థ సిబ్బందితోనే ప్రయాణికులు ఎందుకు గొడవపడుతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. తాజాగా కార్లాను తొలగించడంతో....ఇండిగో వైఖరి సుస్పష్టమైందని అంటున్నారు. తప్పు ప్రయాణికులదా, సిబ్బందిదా అన్న సంగతిపై ఇండిగో నిష్పక్షపాత విచారణ జరపాలని వారు కోరారు.