రాష్ట్ర విభజన తర్వాత పీకల్లోతు ఆర్థిక కష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ ఏపీని అభివృద్ధి పథంలో పయనించేందుకు తీసుకునే చర్యలు ఏపీకి ఎంత లాభదాయంగా మారతాయన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. దేశంలో విమానయాన రంగంలో వృద్ధిరేటు విషయంలో ఏపీ నెంబర్ స్థానంలో ఉండటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంతర్జాతీయ విమాన సౌకర్యం లేకున్నా.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లాంటి అధునాతన విమానాశ్రయం లేకున్నా.. విమానయాన రంగం పరుగులు పెట్టటానికి కారణం ఏమిటన్న విషయంలోకి వెళితే.. ఏపీ ముఖ్యమంత్రి తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా చెబుతున్నారు.
విమాన ఇంధనం మీద ఏపీ సర్కారు పన్నును ఒక శాతం తగ్గించటంతో విమానయాన రంగంలో వృద్ధి రేటుభారీగా మార్పు వచ్చినట్లుగా కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు చెబుతున్నారు. 60 శాతం వృద్ధిరేటుతో ఏపీ దూసుకెళుతుందని.. దేశంలో మరే రాష్ట్రం కూడా ఈ స్థాయిలో వృద్ధిరేటును నమోదు చేయటం లేదని ఆయన చెబుతున్నారు. విమాన ఇందనంపై పన్నురాయితీని ఇవ్వటంతో విమానాలు ఆయిల్ ఫిల్లింగ్ కోసం ఏపీని తమ గమ్యస్థానంగా చేసుకోవటంతో పాటు.. ఏపీ సర్కారు విజయవాడకు తరలి వెళ్లటం కూడా ఏపీ విమానయాన రంగం దూసుకెళ్లటానికి కారణంగా చెబుతున్నారు. విమాన ఇంధనం మీద పన్ను రాయితీ తరహా అంశాల మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరింత చురుగ్గా వ్యవహరిస్తే రాష్ట్రానికి మరింత మేలు జరుగుతుందన్న భావన వ్యక్తమవుతోంది.