వామ్మో.. భోగాపురం కోసం అంత ఖర్చా?

Update: 2016-06-01 07:41 GMT
ఒకరికి పోటీగా మరొకరు అన్నట్లుగా ప్రాజెక్టులను ఒకటి తర్వాత ఒకటిగా ప్రకటిస్తున్నారు నేతలు. ఈ ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి అవుతాయో? వీటి నిర్మాణానికి అవసరమైన నిధులను ఎలా సేకరిస్తారో కానీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త నిర్మాణాల మీద చూపిస్తున్న మోజు అంతాఇంతా కాదు. విశాఖలో ఉన్న ఎయిర్ పోర్ట్ ను ఆధునీకరించే విషయం ఒక కొలిక్కి రాక ముందే.. విజయనగరం జిల్లా భోగాపురంలో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి భారీ ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ఎయిర్ పోర్ట్ కోసం వేలాది ఎకరాల్ని సేకరించే పనిలో ఏపీ సర్కారు ఉండటం.. దీన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ను రూ.13వేల కోట్లతో నిర్మిస్తున్నట్లుగా వెల్లడించారు కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు.  దేశంలో రెండు ఆధునిక విమానాశ్రయాల నిర్మాణం జరుగుతుందని.. అందులో నవీ ముంబయి ఒకటైతే.. రెండోది భోగాపురం ఎయిర్ పోర్ట్ అని ఆయన చెబుతున్నారు.

ప్రభుత్వ..ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తున్న ఈ ఎయిర్ పోర్ట్ పూర్తి అయితే.. దేశంలో అత్యాధునిక ఎయిర్ పోర్ట్ గా భోగాపురం ఎయిర్ పోర్ట్ నిలవనుంది. ఒకేసారి రెండు రన్ వేలను ఇక్కడ నిర్మించాలని భావిస్తున్నారు. ఆలోచనలు నోరూరించేలా ఉన్నా.. వాస్తవంలో ఇవెలా కార్యరూపం దాలుస్తాయో చూడాలి.
Tags:    

Similar News