కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమలను నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించడం సాధ్యం కాదని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి పి.అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. విమానయాన నిబంధనల ప్రకారం తిరుమలను నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించడం సాధ్యపడదని కేంద్ర మంత్రి వివరించారు. అయితే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా తిరుమల స్వామి వారి ఆలయం మీదుగా విమానాల రాకపోకలు సాగకుండా చర్యలు తీసుకుంటామని అశోక్ గజపతిరాజు వివరించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు స్పష్టత ఇచ్చారు.
ఏడుకొండల వాడి సన్నిధిలో విమానాలు ప్రయాణించడం పట్ల భక్తుల మనోభావాలు దెబ్బతినడం తమ దృష్టిలో ఉన్నదని అశోక్ గజపతిరాజు తెలిపారు. అయితే కేంద్ర విమానయాన నిబంధనల ప్రకారం తిరుమలను నో ఫ్లైయింగ్ జోన్ కేటగిరీలో చేర్చడం సాధ్యం పడదని ఆయన వివరించారు. అయినప్పటికీ స్వామి వారి ఆలయం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని విమానాలు ప్రయాణించకుండా చూస్తామని ఆశోక్ గజపతిరాజు తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/