హైకోర్టుకు అశోక్...ఎందుకంటే... ?

Update: 2021-12-24 10:32 GMT
విజయనగరం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతి రాజు హైకోర్టుకు వెళ్లారు. నెల్లిమర్ల పోలీసులు తనపైన నమోదు చేసిన ఎఫ్ ఐ అర్ రద్దు చేయలంటూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కొద్ది రోజుల కిందట రామతీర్ధంలో జరిగిన ఆయన పునరుద్ధరణ పనులకు సంబంధించి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో అశోక్ ప్రోటోకాల్ విషయాన్ని లేవనెత్తారు. ఆచార వ్యవహారాలు సక్రమంగా అధికారులు పాటించడంలేదు అంటూ ఆయన విమర్శించారు.

ఈ సందర్భంగా ఆయన ఆగ్రహంగా శిలాఫలకాన్ని తరలించే ప్రయత్నం చేశారు. అయితే ప్రభుత్వ పెద్దల శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆయన అడ్డుకున్నారంటూ రామతీర్ధం ఆలయ ఈవో ప్రసాద్ ఆయన మీద ఇచ్చిన ఫిర్యాదును అనుసరించి నెల్లిమర్ల పోలీసులు కేసు ఫైల్ చేశరు.

దీని మీద మీడియాతో మాట్లాడిన అశోక్ ప్రభుత్వం తనను టార్గెట్ చేసింది అని ఆరోపించిన సంగతి విషయమే. ఇదిలా ఉండగానే ఆయన హైకోర్టులో ఆ ఎఫ్ ఐ అర్ ని రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేయడం విశేషం.

ఈ కేసు విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది. ఇదిలా ఉండగా అశోక్ పిటిషన్ దాఖలు చేయడంతో మరోమారు జిల్లాలో టీడీపీ వైసీపీ రాజకీయాలు హీటెక్కాయనే చెప్పాలి. అశోక్ కోర్టు కేసులో ఎఫ్ ఐ ఆర్ ని రద్దు చేయమని కోరారు. అయితే ఆలయ సంప్రదాయాలను అనుసరించి అక్కడ శంకుస్థాపన చేయడం లాంటివి ఉండవని ఆయన అన్నారు. మరి దాని మీద ఆయన ఏమైనా కోర్టు ద్వారా వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది.

మొత్తానికి ఈ కేసు విషయంలో ఎఫ్ ఐ ఆర్ తప్పు అని అశోక్ అనుచరులు అంటున్నారు. అయితే ఆయన ప్రభుత్వ పెద్దలను దూషించారని, కార్యక్రమాన్ని జరగకుండా నిరోధించాలని చూసారని వైసీపీ నేతలు అంటున్నారు. మరి కోర్టులో సోమవారం విచారణ మీద సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.
Tags:    

Similar News