అశ్విన్ కూడా హీరో అయిపోయాడు

Update: 2015-12-31 11:16 GMT
కపిల్ దేవ్.. జవగళ్ శ్రీనాథ్... అనిల్ కుంబ్లే... హర్భజన్.. జహీర్ ఖాన్.. వంటి భారత స్టార్ బౌలర్లకు సాధ్యం కానిది భారత్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ సాధించాడు. 42 ఏళ్ల తరువాత ప్రపంచ నంబర్ వన్ బౌలర్ గా భారత్ పేరును ఐసీసీ ర్యాంకింగుల్లో కనిపించేలా చేశాడు. 2015 సంవత్సరానికి ఐసీసీ ర్యాంకింగ్స్ లో అశ్విన్ నంబర్ 1గా నిలిచాడు. 1973లో బిషన్ సింగ్ బేడీ తరువాత ఆ అవకాశం మళ్లీ అశ్విన్ కే వచ్చింది. మధ్యలో కపిల్, శ్రీనాథ్, కుంబ్లే, హర్భజన్ వంటి బౌలర్లున్నా వారంతా 2వ స్థానాన్ని దాటి ముందుకెళ్లలేదు. ముత్తయ్య మురళీధరన్ - షేన్ వార్న్ - ఆ తరువాత డేల్ స్టెయిన్స్ వరుసగా నంబర్ 1 స్థానంలో ఉంటూ వస్తున్నారు. దీంతో భారత బౌలర్లకు ఆ స్థానం అందని పండుగానే మిగిలిపోయింది. ఇప్పుడు 42 ఏళ్ల తరువాత అశ్విన్ ఆ రికార్డు బద్దలు కొట్టాడు.

ఈ ఏడాది అశ్విన్ ఆడిన తొమ్మిది టెస్టులలో 63 వికెట్లు పడగొట్టాడు. వాటిలో ఇటీవలే దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్ట్ సిరీస్ లో నాలుగు టెస్టులలో 31 వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్ 2015కి కేవలం నంబర్ 1 బౌలరుగానే కాకుండా నంబర్ 1 ఆల్ రౌండరుగానూ నిలిచాడు. దీంతో వరల్డ్ కప్ సాధించిన కపిల్ దేవ్, ఒకే ఇన్నింగ్సులో మొత్తం పది వికెట్టూ తీసి రికార్డు సృష్టించిన కుంబ్లేలను మించిపోయి అశ్విన్ టాప్ బౌలరుగా రికార్డులకెక్కాడు.
Tags:    

Similar News