ఓ టీఆర్ ఎస్ ఎంపీ మంచి కార్యక్రమం ప్రారంభించారు. దాన్ని పది మందికి విస్తరించాలని అనుకున్నారు. అందులో వైసీపీకి చెందిన ఓ ఎంపీ వచ్చి చేరారు. మంచి కార్యక్రమం కదా..నలుగురికి విస్తరించాలనే ఉద్దేశంతో... టీడీపీ అధ్యక్షుడు - ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సన్నిహితుడనే పేరున్న వ్యక్తిని కూడా ఆహ్వానించారు. దానికి ఆయన సమ్మతించారు. ఈ ఆసక్తికరమైన పరిణామం తెలంగాణలో జరుగుతున్న గ్రీన్ చాలెంజ్ గురించి.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు - తెలంగాణ సీఎం కేసీఆర్ వదిన కుమారుడు సంతోష్ గ్రీన్ చాలెంజ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖులు ఓ మొక్కను నాటి...మరో ముగ్గురికి మొక్కలు నాటాలనే చాలెంజ్ విసరడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ గ్రీన్ చాలెంజ్ తెలంగాణలో క్రియశీలంగా జరుగుతోంది. ఇందులో వైసీపీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం పాల్గొన్నారు. ఇటీవలే ఆయన మొక్కలు నాటి...మరో ముగ్గురు సైతం నాటాలని ఆహ్వానించారు. ఆ ముగ్గురిలో ఒకరు ఎవరంటే - సినీ ప్రముఖుడు - ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఆప్తుడనే పేరున్న అశ్వనీదత్.
ఎంపీ రఘురామకృష్ణంరాజు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించిన సినీ నిర్మాత అశ్వినీ దత్ గచ్చిబౌలిలోని తన నివాసంలో మొక్కలు నాటారు. అశ్వినీ దత్ తో పాటుగా అయిన కుమార్తె ప్రియాంక దత్ - మనవడు రిషి కార్తికేయ కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అశ్వినీ దత్ మాట్లాడుతూ - జబ్బులకు కాలుష్యానికి దూరంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు చెట్లు పెంచాలి. ఇలాంటి కార్యక్రమన్ని ప్రారంభించిన ఎంపీ సంతొష్ కుమార్ ను అభినందిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా హీరోలు నాని - విజయ్ దేవరకొండ - దర్శకుడు కె.రాఘవేంద్రరావు - కాకినాడ పోర్ట్ చైర్మన్ కె వి రావు - డాక్టర్ జయంతిలకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.