ప్రధాని మోడీ తాజాగా అసోం ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన హిమంత బిశ్వా కి ఓ కీలకమైన సలహా ఇచ్చారు. ప్రభుత్వం గురించి నెగటివ్ అంశాలని తెలుసుకునేందుకు మోదీ అసోం సీఎం హిమంత బిశ్వాకు ఓ సరికొత్త సలహా ఇచ్చారు. కేబినెట్ సమావేశాల్లో జీరో అవర్ తరహా విధానాన్ని అమలు చేయాలని సీఎం బిశ్వాకు సూచించారు. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన హిమంత బిశ్వా తొలిసారి ప్రధానితో బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా కేబినెట్ సమావేశాల్లో జీరో అవర్ తరహా విధానాన్ని అమలు చేయాలని ప్రధాని సూచించినట్లు బిశ్వా తెలిపారు. ఈ జీరో అవర్ ను ప్రభుత్వానికి సంబంధించిన నెగటివ్ అంశాలపై చర్చకు మాత్రమే పరిమితం చేయాలని సూచించారు. దీని ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన నెగటివ్ అంశాలు, దాని పరిష్కారానికి సంబంధించిన సలహాలను మంత్రివర్గ సహచరుల నుంచి తీసుకునేందుకు వీలుంటుందని ప్రధాని సలహా ఇచ్చినట్లు తెలిపారు.ప్రధాని సలహాను పాటించనున్నట్లు తెలిపారు అసోం సీఎం బిశ్వా. ప్రభుత్వానికి సంబంధించిన నెగటివ్ అంశాలను ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజల నుంచి సేకరించి,దాన్ని సీనియర్ మంత్రులకు తెలియజేయాలని సూచించారు. దీనిపై సీనియర్ మంత్రులతో తాను కేబినెట్ సమావేశంలో చర్చించి తక్షణ పరిష్కారాన్ని కనుగొంటామని , ప్రధాని మోదీ తాను గుజరాత్ సీఎంగా పనిచేసిన రోజుల్లో ఇదే విధానాన్ని అమలు చేశారని, ఈ విధానాన్ని తాను అసోంలో అమలుచేయనున్నట్లు చెప్పారు.