సీఎం సంతకం ఫోర్జరీ.. రిలీఫ్ ఫండ్ నుంచి లక్షలు డ్రా

Update: 2020-09-01 17:31 GMT
ఏకంగా ముఖ్యమంత్రికే టోపీ పెట్టారు ఘనులు. సీఎం రిలీఫ్ ఫండ్ పైనే కన్నేసి సీఎం సంతకాన్నే ఫోర్జరీ చేశారు.నకిలీ చెక్కులతో లక్షల రూపాయలు డ్రా చేశారు. సీఎం కార్యాలయం అనుమానంతో ఈ భారీ దోపిడీ బయటపడింది. అసోం రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులను ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ వాసులుగా గుర్తించి అరెస్ట్ చేశారు.

అసోం సీఎం సహాయనిధి నుంచి అక్రమంగా నిధులు విత్ డ్రా అవుతున్నట్టు సీఎం కార్యాలయం అధికారులు గుర్తించారు. సీఎం సోనోవాల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రభుత్వ నిధులను కాజేస్తున్నట్టు అనుమానించారు. విచారణ జరిపించగా.. ఏకంగా లక్షలు డ్రా చేసినట్టు గుర్తించారు.

నకిలీ చెక్కుల ద్వారా హర్యానా, యూపీలోని పలు బ్యాంకుల్లో డబ్బులు విత్ డ్రా చేసినట్లు గుర్తించారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరు గతంలో ఇదే మోసాలకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది.
Tags:    

Similar News