అమ్మాయిలకు ఆ రాష్ట్రంలో ఉచితంగా స్కూటీలు ఇస్తున్నారట !

Update: 2020-08-19 14:50 GMT
కరోనా వైరస్ .. ప్రస్తుతం ప్రపంచం మొత్తం వ్యాపించి .. అందరిని అతలాకుతలం చేస్తుంది, చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ , ఆ తరువాత ఒక్కొక్క దేశం వ్యాపిస్తూ ,ప్రస్తుతం భారతదేశంలో వేగంగా వ్యాపిస్తుంది. కేంద్రం , రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత కట్టడి చేయాలనీ చూస్తున్నా కూడా కరోనా కేసులు కంట్రోల్ అవ్వలేదు. ఇక దీన్ని అరికట్టే వ్యాక్సిన్ కోసం ఇప్పటికే చాలా దేశాల్లో ప్రయోగాలు చివరి దశకి చేరుకున్నాయి. రష్యా ఇప్పటికే ఓ వ్యాక్సిన్ ను కూడా విడుదల చేసింది. భారత్ లో ఓ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాల్లో ఉంది. కరోనా ను అరికట్టడానికి మరో మార్గం లేక లాక్ డౌన్ విధించారు. కానీ , ఆర్థిక వ్యవస్థ కుదేలు అయితే , మరో ప్రమాదం ఏర్పడుతుంది అని భావించి .. లాక్ డౌన్ నుండి సడలింపులు ఇస్తూ వస్తున్నారు. అయితే ప్రజల కష్టాలు మాత్రం వర్ణనాతీతం.

ఇటువంటి క్లిష్ట సమయంలో అస్సాం ప్రభుత్వం ఓ సంచలన ప్రకటన చేసింది. 12వ తరగతి బోర్డు పరీక్షలు ఫస్ట్ డివిజన్ లో పాసైన అమ్మాయిలకు.. ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీ లు ఇవ్వాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజ్ఞ్యాన్ భారతి పేరుతో ఈ పథకం అమలు చేస్తునట్టు తెలిపింది. అలాగే, స్కూటీ కావాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అక్టోబర్ 15 నాటికి స్కూటీ ల పంపిణీ పూర్తి చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే , స్కూటీలు పొందిన ఏ అమ్మాయి అయినా కూడా స్కూటీ తీసుకున్న సమయం నుండి మూడేళ్లపాటు అమ్మకుండా ప్రభుత్వం నిబంధన విధించింది. ఆ తర్వాత వారికీ ఇష్టం లేకపోతే అమ్ముకోవచ్చు.
Tags:    

Similar News