'విరుష్క' మ్యారేజ్ స్పాట్ లో గాలిని అమ్ముతున్నారు.. టిన్ను రూ.1000!
తాడవుగా ఫుల్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్ లో గాలిని చిన్న చిన్న టిన్నుల్లో నింపి అమ్మేస్తున్నారు.
కుక్క పిల్ల.. సబ్బు బిళ్ళా.. అగ్గి పుల్లా.. కదేదీ కవితకు అనర్హం అని శ్రీశ్రీ చెప్పినట్లుగా... గాలి, నీరు, అగ్ని... ప్రకృతిలో ఏదైనా అమ్మకం సరుకే అని ఇప్పటికే రుజువైన పరిస్థితి! తాగు నీరు కొనుక్కుని తాగుతామని ఎప్పుడూ అనుకోలేదు అని గోదావరి జిల్లాల్లోని పెద్దలు ఇప్పటికీ ఆశ్చర్యపోతుంటారు. అయితే.. ఏకంగా గాలినే అమ్మేస్తున్నారని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో?
అవును... ఈ భూమ్మీద ఉన్న ప్రతీదీ అమ్మకం సరుకే అనే మాట అబద్ధం కాదని నిరూపించే వ్యాపారం ఒకటి తాజాగా తెరపైకి వచ్చింది. పంచభూతాల్లో ఒకటి అయిన నీరుని కొనుక్కుని తాగుతున్నారు.. అగ్గి పెట్టేలు, గ్యాస్ లైటర్ల రూపంలో అగ్ని అమ్మకానికి దొరుకుతుంది.. ఈ సమయంలో గాలిని మాత్రం ఎందుకు వదలాలి అనుకున్నట్లున్నారు ఇటలీ వాసులు!
అనుకునదే తాడవుగా ఫుల్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్ లో గాలిని చిన్న చిన్న టిన్నుల్లో నింపి అమ్మేస్తున్నారు. దీని ధర వెయ్యి రూపాయలకంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇప్పుడు ఈ విషయం తెలిసినవారు షాకవుతున్నారు. ఏమిటీ ఆ గాలి ప్రత్యేకత అని అడుగుతునారు. అయితే.. నిజంగానే ప్రత్యకత ఉందని అంటున్నారు అమ్మకందారులు!
ఇటలీలోని ఓ పెద్ద సరస్సుని ఆనుకుని ఉండే లేక్ కోమో టూరిస్ట్ స్పాట్ ఎంత ఫేమస్ అనేది తెలిసిన విషయమే. విరాట్ కొహ్లీ - అనుష్క శర్మల పెళ్లి జరిగింది ఈ స్పాట్ లోనే. ఇక్కడున్న గ్రామాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవనే చెప్పాలి. అంత అధుతంగా ఉండే లేక్ కోమో సరస్సు మీద పిల్లగాలులకి ఓ సీక్రెట్ ఫార్ములాను జతచేస్తున్నారు.
ఈ సమయంలో కమ్యునికా అనే సంస్థ ఆక్సిజన్, నైట్రోజన్ లాంటి వాయువులను టిన్నుల్లో నింపుతుంది. దీని ధరను వెయ్యి రూపాయలకంటే ఎక్కువగా ఫిక్స్ చేసింది. ఈ సందర్భంగా... మీకు ప్రశాంతత కావాలనుకున్నప్పుడు ఆ గాలి డబ్బా మూత తెరవండి.. మీ మూడ్ వెంటనే మారిపోతుంది.. అంటూ ప్రచారం చేస్తోంది.
ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది. మరీ దారుణంగా ఆ గ్రామంలోని గాలిని అమ్మడం ఏమిటి.. చిన్న చిన్న టిన్నుల్లో నింపడం ఏమిటి.. వాటిని కొనుక్కొని వెళ్లడం ఏమిటి అంటూ షాకవుతూ స్పదిస్తున్నారు నెటిజన్లు!