12 వేల పందులను చంపేయబోతున్న అసోం !

Update: 2020-09-24 14:30 GMT
దేశంలో ఓ వైపు కరోనా మహమ్మారి బయపెడుతుంటే, ఇదే సమయంలో అసోంలో ఆఫ్రికన్ సైన్‌ ఫ్లూ విజృంభించే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో 12 వేల పందులను చంపేయాలని అసోం ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. దీనిని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ విధంగా పందులను చంపినపుడు వాటి యజమానులకు పరిహారం చెల్లిస్తామని చెప్పారు. సంబంధిత పరిహారాన్ని యజమానుల బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నట్టు అధికారులు తెలిపారు. దాంతో పాటుగానే పందుల రవాణాను కూడా ఆపేసింది.

ఇప్పటికే అసోంలోని 14 జిల్లాలలో 18 వేలకు పైగా పందులు వ్యాధి కారణంగా చనిపోయాయి. మొత్తం 14 జిల్లాలలో స్వైన్ ఫ్లూ ప్రభావం కనిపిస్తోందని పశు సంవర్ధక శాఖ సీనియర్ అధికారి తెలిపారు. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అసోంలో తొలిసారి ఈ ఏడాది ఫిబ్రవరిలో వెలుగుచూసింది. పశు సంవర్ధక శాఖ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి శర్వానంద్ సోనేవాల్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా, నిపుణుల అభిప్రాయానికి కట్టుబడి, ప్రభావిత జిల్లాల్లో పందుల సంతతిని ముట్టుబెట్టే కార్యక్రమం దుర్గా పూజకు ముందే పూర్తిచేయాలని ఆదేశించారు’అని అధికారిక ప్రకటన విడుదల చేశారు.

అనారోగ్యంతో ఉన్న పందుల లెక్కలను తీయబోతున్నారు. ఆరోగ్యకరమైన జంతువులకు ఈ వ్యాధి సంక్రమించకుండా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. 2019 లెక్కల ప్రకారం అసోంలో వరాహాల సంఖ్య 21 లక్షలుగా ఉంది. రెండుమూడేళ్లలో ఈ సంఖ్య మరింత పెరిగి 30 లక్షలకు పెరిగింది.
Tags:    

Similar News