పాక్ బరితెగింపు...సామాన్యుల దుర్మరణం
బరితెగించిన పొరుగుదేశం పాకిస్థాన్ మరో ఉన్మాదానికి పాల్పడింది. యురీ ఘటన నేపథ్యంలో భారత్ సర్జికల్ దాడులకు పాల్పడినప్పటినుంచి ప్రతీకారంతో రగిలిపోతున్న పాక్.. కనీస విచక్షణను కూడా విస్మరిస్తున్నది. నియమాలు - విలువలను వదిలేసి బరితెగిస్తున్నది. ఇందుకు పరాకాష్ఠగా నిరాయుధులైన సామాన్య ప్రజలపై తన కర్కశత్వాన్ని ప్రదర్శించింది. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ - అంతర్జాతీయ సరిహద్దు సమీప పల్లెలు - గ్రామాలపై - భారత సైనిక పోస్టులపై పాక్ సైనికులు విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఫిరంగి గుండ్ల వర్షం కురిపించారు. ఈ దారుణంలో ఎనిమిది మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, 22 మంది గాయపడ్డారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు - పిల్లలే. ఒకేరోజు ఇంతమంది చనిపోవడం రెండు దశాబ్దాల కాలంలో ఇదే తొలిసారని భావిస్తున్నారు. ఇందుకు ప్రతిగా భారత సైనికులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పాక్ సైనికులు మరణించారు.
14 పాక్ పోస్టులను భారత బలగాలు ధ్వంసం చేశాయి. సర్జికల్ దాడుల తర్వాత పాక్ సైన్యం జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 12మంది పౌరులు సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారినప్పటి నుంచే పాక్ దళాలు జమ్ముకశ్మీర్ లో అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) - నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంట.. సాంబా - జమ్ము - పూంచ్ - రాజౌరీ జిల్లాల్లోని గ్రామాలపై - భారత సైనిక పోస్టులపై కాల్పులు ప్రారంభించాయి. ఫిరంగి గుండ్లను కురిపించాయి. ఈ ప్రాంతాలతోపాటు బాలాకోట్ - నౌషెరా సెక్టారల్లోనూ పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ దళాలు భారీ సామర్థ్యమున్న 120 ఎంఎం - 82 ఎంఎం మోర్టార్ బాంబులను వినియోగించాయని సైన్యం తెలిపింది. పాకిస్థాన్ రేంజర్లు తొలుత చిన్నపాటి ఆయుధాలతో కాల్పులు ప్రారంభించారు. ఆ తర్వాత ఓ చోట మోర్టార్లను ప్రయోగించారు. ఆరున్నరగంటలకల్లా సాంబా జిల్లా రాంగఢ్ - ఆర్నియా సెక్టార్లకు కాల్పులు విస్తరించాయి అని బీఎస్ ఎఫ్ (జీ) డీజీ ధర్మేంద్ర పరీక్ తెలిపారు. వాళ్లు 82 ఎంఎం మోర్టార్ బాంబులను ప్రయోగించారు. బీఎస్ ఎఫ్ అందుకు దీటుగా బదులిచ్చింది అని ఆయన చెప్పారు. పాక్ దాడుల్లో పలువురు మహిళలు - పిల్లలు మరణించినట్లు సాంబా ఎస్పీ తెలిపారు. రాంగఢ్ సెక్టార్ లోని ఓ పల్లెపై పాక్ దళాల ఫిరంగి గుండ్ల దాడిలో 21 ఏండ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది.
ఆర్నియా సెక్టార్ లోని పిండి గ్రామంపై మూడు ఫిరంగి గుండ్లు పడినప్పుడు బోధ్ రాజ్ (44) - నికీ - ధారణదేవి - చంచ్లాదేవి గాయపడ్డారు. రాంగఢ్ సెక్టార్ లో సుమారు ఐదేండ్ల వయసున్న ఇద్దరు బాలురు.. రిశబ్ - అభి - 19 ఏండ్ల రవీందర్ కౌర్ చనిపోయారు. ఎనిమిదిమంది గాయపడ్డారు. మోర్టార్ ఇంటిపై పడినప్పుడు రవీందర్ కౌర్ కు తీవ్ర గాయాలయ్యారు. ఆ ముక్కలు శరీరంలోకి చొచ్చుకెళ్ళడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. రాజౌరీ జిల్లా పనియారీ గ్రామంలో పాక్ కాల్పుల్లో మరో ఇద్దరు మహిళలు బలయ్యారు.జమ్ముకశ్మీర్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు టెర్రరిస్టులు బీఎస్ ఎఫ్ కెమెరా కంటికి చిక్కారు. దీపావళి రాత్రి.. అంతర్జాతీయ సరిహద్దు వెంట కథువా జిల్లాలోని హీరానగర్ సెక్టార్ లోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. బీఎస్ ఎఫ్ ఇన్ ఫ్రా రెడ్ కెమెరా ఈ దృశ్యాలను రికార్డు చేసింది. పాకిస్థాన్ వక్ర బుద్ధి మారడం లేదనేందుకు ఇది తాజా నిదర్శనమని సైనికవర్గాలు వ్యాఖ్యానించాయి.
తాజా పరిణామాల నేపథ్యంలో జమ్ముకశ్మీర్ గవర్నర్ వోహ్రా.. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పరిస్థితుల గురించి వారు చర్చించారు.జమ్ముకశ్మీర్ గవర్నర్ ఎన్ ఎన్ వోహ్రా మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులపై - ప్రత్యేకించి విద్యాసంస్థల పునఃప్రారంభంపై చర్చించారు.రాష్ట్రంలో 110 రోజులకుపైగా కొనసాగుతున్న అశాంతిమయ వాతావరణం గురించి గవర్నర్ వివరించారు. జూలై 8న హిజ్బుల్ మిలిటెంట్ బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ జరిగినప్పటి నుంచి కశ్మీర్ లో బడులు మూతపడ్డాయి. 26 స్కూళ్లను దుండగులు కాల్చివేసిన అంశం చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. విద్యాసంస్థలకు ముఫ్తీ ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాలని కేంద్రం కోరినట్లు అధికారవర్గాలు తెలిపాయి. కశ్మీర్ లో ఘటనలు - పిల్లల భవిష్యత్తు పట్ల కేంద్రం తీవ్రంగా కలవరపడుతున్నది. ప్రధాని మోదీ కూడా ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేశారని తెలిసింది. రాష్ట్రంలో సుదీర్ఘంగా కొనసాగుతున్న ప్రతిష్టంభన పిల్లలపై ప్రభావం చూపుతుందని, స్కూళ్ల పునఃప్రారంభమనేది సాధారణ స్థితిని నెలకొల్పడంలో తీసుకునే పెద్ద చర్య అవుతుందని మోదీ అభిప్రాయపడినట్లు హోం శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని కొన్ని శక్తులు.. పిల్లలను మతపరమైన సంస్థలు - మదార్సాలలో చేర్పించాలని ప్రయత్నిస్తున్నాయని, ఆధునిక విద్యను ఎంచుకోవద్దని చెప్తున్నాయని అధికారవర్గాలు తెలిపాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/