గ్రేట్ వర్క్ లోకేశ్.. మూడు రోజుల్లోనే భవన నిర్మాణం!

ఆయన జోరు చూసి అంతా అవాక్కవుతున్నారు. లోకేశ్ పనితీరును కొనియాడుతున్నారు.;

Update: 2025-03-17 10:15 GMT

మంత్రి నారా లోకేశ్ యమా స్పీడుగా పనిచేస్తున్నారు. ఆయనతో పోటీపడలేక మిగతా మంత్రులు, నేతలు వెనకబడిపోతున్నామని అంటున్నారు. ఇక మంత్రి లోకేశ్ కన్నా ఒక్కరోజైనా ముందుగా అసెంబ్లీకి రావాలని అనుకుంటున్నా, తాను విఫలమవుతున్నానని తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కూడా చేతులెత్తేశారు. తన విధి నిర్వహణలో ఇంత స్పీడుగా పనిచేస్తున్న మంత్రి లోకేశ్ ప్రజలకు ఇచ్చిన మాటను అమలుచేయడంలోనూ అంతే వేగంగా కదులుతున్నారు. ఆయన జోరు చూసి అంతా అవాక్కవుతున్నారు. లోకేశ్ పనితీరును కొనియాడుతున్నారు.

మంత్రిగా ప్రజా సమస్యలపై స్పందించడమే కాకుండా, ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించేలా లోకేశ్ అడుగులు వేస్తున్నారు. తాజాగా కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గంలో కాశినాయన క్షేత్రంలో కూల్చిన భవనాలను యుద్ధప్రాతిపదికన పునఃనిర్మించి శభాష్ అనిపించుకున్నారు. ఓ భవనం నిర్మించాలంటే కనీసం మూడు నెలల సమయం అవసరం, కానీ కాశీనాయన క్షేత్రంలో కూల్చిన భవనాలను ఆధునిక సాంకేతికత ఉపయోగించి కేవలం మూడంటే మూడు రోజుల్లోనూ పూర్తి చేశారు. రోజూ వేల మందికి ఉచితంగా అన్నదానం చేసే కాశినాయన ఆశ్రమం టైగర్ రిజర్వు అటవీ ప్రాంతం పరిధిలో ఉంది. దీంతో సాంకేతిక కారణాలతో అటవీ అధికారులు కాశీనాయన క్షేత్రంలోని భవనాలను కూల్చివేశారు.

భక్తుల విశ్వాసాలతో ముడిపడిన ఈ వ్యవహారంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని భావించిన మంత్రి లోకేశ్ ఆగమేఘాలపై స్పందించారు. జరిగిన పొరపాటును సరిచేసుకుంటామని, కూల్చిన భవనాల స్థానంలో కొత్తవి తన సొంత ఖర్చుతో నిర్మిస్తానని గత బుధవారం హామీ ఇచ్చారు. మంత్రి లోకేశ్ ఈ ప్రకటన చేసిన వెంటనే ఆయన టీం రంగంలోకి దిగిపోయింది. గురువారం ఉదయానికే నిర్మాణాలను ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతను వాడి వాయువేగంతో భవనాలను సర్వాంగ సుందరంగా నిర్మించారు. సోమవారం నుంచి సకల ఏర్పాట్లు కల్పించి ఆశ్రమ నిర్వహకులకు అప్పగించారు. మాటిచ్చిన 72 గంటల్లోనే పని పూర్తి చేయించడంపై ఆశ్రమ నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భవనాలను నిర్మించడమే కాకుండా కాశీనాయన క్షేత్రానికి బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు ఆ

Tags:    

Similar News