ట్రంప్ గ్యాప్ ఇవ్వడం లేదు... జెలెన్ స్కీ కి మరో షాక్!
జెలెన్ స్కీకి ట్రంప్ వరుస షాకులు ఇస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా మరో షాక్ ఇచ్చారు.;
వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ – ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ మధ్య జరిగిన భేటీ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. వాస్తవానికి రష్యా చేస్తున్న యుద్ధానికి తెర దించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం.. దానికి బదులుగా ఉక్రెయిన్ లోని అరుదైన ఖనిజాల తవ్వకాలకు అనుమతించాలని అమెరికా ప్రతిపాదించింది.
దీంతో.. జెలెన్సీ వైట్ హౌస్ కి వెళ్లారు. ఈ సందర్భంగా ఇరువురి ప్రెసిడెంట్స్ మధ్య మాటల యుద్ధం మొదలైంది.. దీంతో.. ఎటువంటి అగ్రిమెంట్లూ జరగకుండానే చర్చలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. మరోపక్క రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ కు మద్దతును డొనాల్డ్ ట్రంప్ ఉపసంహరించుకున్నారు! దీంతో... రష్యా దూకుడు పెంచిందని అంటున్నారు.
ఇలా ఉక్రెయిన్ కు వరుస స్ట్రోకులు ఇస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. మరోపక్క వేగంగా కాల్పుల విరమణ అమలు చేసేందుకు మంగళవారం ట్రంప్ నేరుగా రష్యా అధినేత పుతిన్ తో ఫోన్ లో చర్చలకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి జెలెన్ స్కీకి షాకిచ్చారు డొనాల్డ్ ట్రంప్. దీంతో... ఉక్రెయిన్ కు వరుస దెబ్బలు తప్పడంలేదని అంటున్నారు.
అవును... జెలెన్ స్కీకి ట్రంప్ వరుస షాకులు ఇస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా మరో షాక్ ఇచ్చారు. ఇందులో భాగంగా... ఉక్రెయిన్ ఆక్రమణకు కారణమైన నాయకులపై దర్యాప్తు కోసం ఏర్పాటుచేసిన మల్టీనేషనల్ గ్రూప్ నుంచి అమెరికా వైదొలిగింది. అంటే... రష్యా అధినేత పుతిన్ పై విచారణ జరపాల్సి ఉన్న గ్రూపు నుంచి అమెరికా తప్పుకుందన్నమాట!
దీంతో... "ది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ది ఇప్రాసిక్యూషన్ ఆఫ్ క్రైమ్ ఆఫ్ అగ్రెషన్ అగైనెస్ట్ ఉక్రయిన్" నుంచి అమెరికా వైదొలగనుంది! వాస్తవానికి ఈ గ్రూపులో అమెరికా 2023లో చేరింది. అంతర్జాతీయ అట్టాల ఉల్లంఘన, దౌర్జన్యాలకు పాల్పడిన రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్, బెలారస్ లను బాధ్యులను చేసేందుకు దీన్ని ఏర్పాటు చేశారు.
మరోపక్క ఉక్రెయిన్-రష్యా యుద్ధం వ్యవహారంలో అమెరికా చాలా వేగంగా నిర్ణయాలు తీసుకొంటోంది. దీనిపై స్పందించిన ట్రంప్... తాను మంగళవారం పుతిన్ తో చర్చలు అజ్రగపునున్నానని.. తాము భూమి, పవర్ ప్లాంట్ల గురించి కూడా చర్చించుకున్నామని.. కొన్ని ఆస్తులను రష్యా-ఉక్రెయిన్ మధ్య విడదీయడంపై ఇప్పటికే మాట్లాడానని అన్నారని రాయిటర్స్ వెల్లడించింది.