టి20 ప్రపంచ కప్ లో టీమిండియా ప్రస్థానం ముగిసింది. ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల పరాజయంతో అవమానకర రీతిలో ఇంటికి వచ్చేసింది. ఇప్పుడదంతా గతం.. ఇక భవిష్యత్ గురించి ఆలోచించాలి. 2015 లో ఇంగ్లండ్ వన్డే ప్రపంచ కప్ లో ఎలాగైతే దారుణ పరాజయం అనంతరం పునర్ నిర్మాణం చేపట్టిందో భారత టి20 జట్టును కూడా అలా చేయాలి. లేదంటే వచ్చే 2024 టి20 ప్రపంచ కప్ పైనా ఆశలు వదులుకోవాల్సిందే.
రిటైర్ లేదంటే వేటే సీనియర్ స్పిన్నర్ అశ్విన్, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అంతర్జాతీయ టి20 కెరీర్ ముగిసిపోయినట్లే. కొన్నేళ్ల కిందటే పొట్టి ఫార్మాట్ లో వీరి అంతర్జాతీయ కెరీర్ ముగిసినా.. ఐపీఎల్ ప్రదర్శనతో అనూహ్యంగా జట్టులోకి వచ్చారు. బ్యాట్ వదిలేసి కామెంటేటర్ గా మారిన కార్తీక్ కు లక్ కలిసొచ్చింది. ఐపీఎల్ ఫామ్ తో ఫినిషర్ గా 37 ఏళ్ల వయసులో టీమిండియాలోకి పునరాగమనం చేశాడు. ఇక అశ్విన్ కూడా అంతే. వాస్తవానికి రవీంద్ర జడేజా ఉన్నందున విదేశాల్లో టెస్టుల్లోనూ అశ్విన్ కు చోటు కష్టమే అవుతోంది. అలాంటిది ఇప్పుడు టి20ల్లో అందులోనూ ప్రపంచ కప్ జట్టు సభ్యుడయ్యాడు. అయితే, ఇకపై వీరిద్దరికీ ఇకపై జట్టులో చోటు లేనట్లే. కార్తీక్ అయితే అంతర్జాతీయ కెరీర్ కు గుడ్ బై చెప్పడమే మిగిలింది. అశ్విన్ బౌలింగ్ ఎలాగూ టి20లకు పనికిరాదు కాబట్టి అతడిని టెస్టులకు పరిగణిస్తారు.
రోహిత్ సంగతేంటి? కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ కూడా గొప్పగా లేదు. అతడి స్ట్రోక్ ప్లే ఇక గతమే అన్నట్లుంది. ఈ టి20 ప్రపంచ కప్ లో అది స్పష్టంగా తెలిసిపోయింది. సెమీఫైనల్లోనూ రోహిత్ దూకుడుగా ఆడలేకపోయాడు. కెప్టెన్ గా ఉంటూ.. ఓపెనింగ్ కు దిగుతూ భారీ మెరుపు ఇన్నింగ్స్ లు ఆడకుంటే కష్టమే. అందులోనూ రోహిత్ వయసు 35 దాటుతోంది. కుర్రాళ్ల ఫార్మాట్ అయిన టి20లకు అతడిని పరిగణించడం అంటే కష్టమే.
కోహ్లి మరో ఏడాది.. రాహుల్ కష్టమే... మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ టి20 ప్రపంచ కప్ లో పూర్తిగా నిరాశపర్చాడు. నెదర్లాండ్స్, జింబాబ్వే లాంటి చిన్న జట్లపై తప్ప అతడు రాణించింది లేదు. సెమీఫైనల్లో మరీ నిరాశజనకం. బౌలర్ ఎత్తుగడను అర్థం చేసుకోలేక వికెట్ పారేసుకున్నాడు. దీన్నిబట్టి రాహుల్ టి20 జట్టుకు భారంగా మారాడని చెప్పొచ్చు. శుభ్ మన్ గిల్, ప్రథ్వీ షా వంటి కుర్రాళ్లు దూసుకువస్తున్న క్రమంలో రాహుల్ ను ఇంకెంతో కాలం భరించలేరు. వచ్చే సిరీస్ లో పరుగులు సాధించకుంటే అతడిపై వేటు ఖాయం. ఇక కోహ్లి వయసు 34. అతడినీ వచ్చే ప్రపంచ కప్ జట్టు సభ్యుడిగా పరిగణించలేం. వాస్తవానికి ఆసియా కప్ లో ఫామ్ లోకి రాకుంటే కోహ్లి టి20 కెరీర్ ముగిసిపోయేది. కానీ, ఆసియా కప్, ప్రపంచ కప్ లో రాణించి స్థానం నిలుపుకొన్నాడు. కానీ, భవిష్యత్ కోణం వాస్తవంగా ఆలోచిస్తే కోహ్లి స్థానంలో మరొకరిని తయారు చేయాల్సిన అవసరం ఉంది.
వచ్చే కప్ కోసం సన్నద్ధం కావాలి 2024లో టి20 ప్రపంచ కప్ జట్టు వెస్టిండీస్- అమెరికాల్లో జరుగనుంది. అందుకోసం టీమిండియాను సిద్ధం చేయడంపై ఇప్పటినుంచే శ్రద్ధ పెట్టాలి. రజత్ పటిదార్ వంటి కుర్రాళ్లకు అవకాశం
ఇవ్వాలి. మరోవైపు పేస్ లో పదునున్న బౌలర్లను వెదకాలి. ఉమ్రాన్ మాలిక్ లాంటి కుర్రాళ్లను సానబెట్టాలి. శ్రేయస్ అయ్యర్, గిల్, షా, కిషన్ వంటి కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలి. లేదు.. కాదు.. ఇప్పటిలానే సీనియర్లనే నమ్ముకుని బరిలో దిగుతామంటే ఫలితంలో మార్పుండదు. ప్రపంచ కప్ అందదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.