కాలం మారింది. అందుకు తగ్గట్లే దేశంలోని మహిళల తీరు తెన్నులు మారుతున్నాయి. గతంలో పెళ్లి అన్నంతనే సిగ్గులు ఒలికిస్తూ.. దించిన తలను పైకెత్తేందుకు సైతం నో అన్నట్లుగా వ్యవహరించే రోజులు ఉండేవి. మారిన పరిస్థితులకు తగ్గట్లే.. కొందరు మహిళలు ఆశా జ్యోతులుగా మారుతున్నారు. వారి తీరు భారత నారీమణుల స్థాయిని చెప్పేస్తోంది. స్వతంత్య్ర భారతంలో మహిళలు స్వయంశక్తితో జీవించటమే కాదు.. తమకు నచ్చినట్లుగా బతికేందుకు చేస్తున్న ప్రయత్నాలు చూసినప్పుడు మరింత ముచ్చటేయటం ఖాయం. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ గా మారింది.
ఈ ఫోటోలోని మహిళను చూసినంతనే మోడల్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉండటమే కాదు.. తన కాస్ట్యూమ్స్ కు ఏ మాత్రం సూట్ కాని రీతిలో ఒక భారీ లారీని డ్రైవ్ చేస్తున్న వైనం చూస్తే.. మిస్ మ్యాచ్ అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ.. విషయం తెలిసిన తర్వాత మాత్రం వావ్.. అనకుండా ఉండలేరు. అంతేకాదు.. ఆమె వివరాలు తెలుసుకొని.. మనింట్లోనూ ఇలాంటి అమ్మాయి ఉంటే ఎంత బాగుండన్నట్లుగా ఉంటుంది. ఇంతకీ ఆ అమ్మాయి పేరు ఏమంటారా? అక్కడికే వస్తున్నాం. ఆమె పేరు దలీషా. కేరళలోని త్రిసూర్ లో ఆమె నివాసం.
ఒక్కసారిగా ఆమె అంతలా ఫేమస్ కావటానికి కారణం..తన ఎంగేజ్ మెంట్ రోజున కాబోయే భర్తను వెంట పెట్టుకొని లారీలో పక్కన కూర్చోబెట్టుకొని చర్చికి వెళ్లటం. అదేంటన్న ఆశ్చర్యం అక్కర్లేదు దలీషా గురించి వివరాలు తెలిస్తే.. విస్మయానికి గురి కావాల్సిందే. ఆమెను అభినందించకుండా ఉండలేం. లారీ డ్రైవర్ అయిన తండ్రి డేవిస్ కుమార్తె దలీషా. చిన్నప్పటి నుంచి లారీ డ్రైవింగ్ ను ఇష్టపడే ఆమె.. చదువు అయ్యాక లారీ డ్రైవింగ్ లైసెన్సును సంపాదించింది.
తండ్రికి బదులుగా కొన్నిసార్లు తానే లారీని స్వయంగా నడిపేది. దీనికి సంబంధించిన ఫోటోలు మీడియాలో పబ్లిష్ అయ్యాయి. అంతేకాదు.. పెట్రోల్ లారీలను నడుపుతూ దూర ప్రాంతాలకు ధైర్యంగా తీసుకెళ్లే ఆమె గురించి తెలిసిన గల్ఫ్ సంస్థ ఆమెకు తమ సంస్థలో ఉద్యోగాన్ని ఇచ్చింది. జాబ్ చేస్తున్న వేళ.. తన తోటి డ్రైవర్ హాన్సన్ తో మొదలైన పరిచయం ప్రేమగా మారటం..
ఇరు కుటుంబాలు ఓకే అనటంతో వారి పెళ్లి నిశ్చయమైంది. ఎంగేజ్ మెంట్ వేళ.. రోటీన్ కు కాస్తంత భిన్నంగా వ్యవహరించాలనుకుందో ఏమో కానీ.. దలీషా.. పెళ్లి కుమార్తెగా ముస్తాబు కావటమే కాదు.. కాబోయే భర్తను పక్కన కూర్చెబెట్టుకొని తన నిశ్చితార్థ వేడుక జరిగే సెయింట్ ఆంధోనీ చర్చికి తన లారీతో వెళ్లింది. పెళ్లికూతురు స్వయంగా లారీ నడుపుకురావటం.. అది కూడా కాబోయే భర్తను పక్కన పెట్టుకున్న తీరు చూసిన వారంతా వావ్ అనటమే కాదు.. దీనికి సంబంధించిన పిక్ ను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. దీంతో.. దలీషా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.