టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్

Update: 2020-08-13 12:10 GMT
ఏపీలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం కరోనా ను ఎంతగా తగ్గించాలని చేస్తున్నప్పటికీ , కరోనా అంత ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. రాష్ట్రంలో సామాన్యుల నుండి విఐపిలు , ప్రజాప్రతినిధులు కరోనా భారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా నిర్దారణ కాగా , తాజాగా టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడికి కరోనా సోకింది. జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న అచ్చెన్నాయుడుకు గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి అచ్చెన్నకు జలుబు చేయటంతో , కరోనా పరీక్షలు నిర్వహించగా గురువారం కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ప్రతివారం ఆసుపత్రి హైకోర్టుకు హెల్త్ బులెటిన్ అందిస్తుంది. ఇందులో భాగంగా గురువారం అచ్చెన్నకు కరోనా పాజిటివ్ వచ్చిందని హోకోర్టుకు తెలిపింది. ప్రస్తుతం అచ్చెన్నాయుడుకు రమేష్‌ ఆస్పత్రిలోనే వైద్యులు కరోనా చికిత్స చేస్తున్నారు. అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్ అని తేలడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కాగా.. ఈఎస్ ‌ఐ మందుల కొనుగోలులో అవకతవకలు జరిగాయని అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జూన్-12న అచ్చెన్న స్వగ్రామం నిమ్మాడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే కొంత మంది అధికారులను కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుంది.

కాగా, గత 24 గంటల్లో 9,996 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు. ఇదే సమయంలో 82 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,64,142కి చేరుకున్నాయి. మొత్తం మరణాలు 2378గా నమోదయ్యాయి.
Tags:    

Similar News