ఏటీఎం అన్న వెంటనే ఎనీ టైం మనీ అన్న మాట గుర్తుకు వస్తుంది. ప్రధాని మోడీ పుణ్యమా అని ఎనీ టైం మూసివేత అన్నట్లుగా ఉండే ఏటీఎం సెంటర్ల కారణంగా సామాన్యులు పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. ఇవి సరిపోనట్లుగా ఇప్పుడు షాకింగ్ నిర్ణయాన్ని తీసుకునేలా బ్యాంకర్లు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
నిర్వహణ భారాన్ని తగ్గించుకోవటానికి బ్యాంకులు.. నేరాల్ని అదుపు చేయటానికి వీలుగా పోలీసుల కారణంగా 24 గంటలు తెరిచి ఉంచే ఏటీఎం సెంటర్లు రానున్న రోజుల్లో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6గంటల వరకూ మూసి ఉంటాయా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.
ఇటీవల సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో బ్యాకింగ్ ఉన్నతాధికారులతో కలిసి పోలీసు ఉన్నతాధికారులు నిర్వహించిన సమావేశంలో తక్కువ రద్దీ ఉండే ఏటీఎం సెంటర్లను మూసివేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.
హైదరాబాద్ నగర శివారుల్లోని ఏటీఎం సెంటర్లలో కొందరు కిలాడీలు సైబర్ నేరాలకు వీలుగా ఏటీఎం సెంటర్లను వినియోగించుకుంటున్న నేపథ్యంలో రాత్రి నుంచి పగలు వరకూ ఏటీఎం సెంటర్లను డీలింక్ చేయటం.. లేదంటే మూసివేసి ఉంచటం లాంటివి చేయాలన్న మాట బలంగా వినిపించింది. దీనిపై తమ బ్యాంకు ప్రధాన కార్యాలయం దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది.
నిర్వహణ వ్యయంతో పాటు సైబర్ నేరాల్ని నియంత్రించేందుకు వీలుగా ఏటీఎం సెంటర్లను మూసి ఉంచటమే మంచిదన్న అభిప్రాయం పోలీసులు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. రాత్రివేళ 5 కంటే తక్కువ లావాదేవీలు జరిగే ఏటీఎంలను మూసి ఉంచటమే మంచిదన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమైందని.. డీలింక్ తో పోలిస్తే.. మూసి ఉంచటమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు చెబుతున్నారు. ఒకవేళ.. బ్యాంక్.. పోలీసు ఉన్నతాధికారులు అనుకున్నట్లు ఏటీఎంలను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంటే మాత్రం సామాన్యులకు సరికొత్త సమస్యలు తలెత్తటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే కొన్ని ఏటీఎంలలో డబ్బులు ఉండని పరిస్థితి. మరికొన్నింటిని భద్రత కోసం మూసి వేస్తే.. ఎప్పుడు ఎక్కడ ఏ ఏటీఎం తెరిచి ఉంటుందన్నది సమస్యగా మారే వీలుందని చెప్పక తప్పదు.