సమాజంలో మహిళలపై జరిగే అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వారిని కాపాడటానికి ఎన్ని చట్టాలు తీసుకువస్తున్నా కూడా మహిళలపై జరిగే అఘాయిత్యాలు మాత్రం తగ్గడంలేదు. ప్రతి రోజు ఏదో ఒక చోట మహిళలు, చిన్నారులు, యువతులపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ లో ఓ కామాంధుడు మైనర్ బాలిక పై అత్యాచారం చేశాడు. బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. అయితే, కొన్ని రోజుల తర్వాత బాలిక అనారోగ్యానికి గురికావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడుని ఉత్తరప్రదేశ్ కు చెందిన గోపిగా గుర్తించారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ఓ మైనర్ బాలికను బెదిరించిన గోపి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ దృశ్యాలను తన సెల్ ఫోన్ లో వీడియోలు తీశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బాలికపై బెదిరింపులకు పాల్పడ్డాడు. నా వద్ద గన్ ఉందని, ఈ విషయం నీ తల్లిదండ్రులకు చెప్తే వాళ్లను కూడా కాల్చేస్తాను గోపి బాలికను బెదిరించాడు. ఇలా పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే కొద్ది రోజులుగా బాలిక అనారోగ్యంగా ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలికపై అత్యాచారం జరిగిన విషయం బయటపడింది. దీంతో బాధిత బాలిక కుటుంబ సభ్యులు ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు.