ఏపీ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. మొన్నటి వరకు అధికార.. విపక్షాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం అనూహ్యంగా అసహ్యకరమైన రూపులోకి మారింది. డ్రగ్స్ మాఫియా మీద ఆరోపణలు.. ప్రతిఆరోపణలు చోటు చేసుకుంటున్న వేళ.. టీడీపీ నేత పట్టాభి పెట్టిన ప్రెస్ మీట్ తో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. స్విచ్ వేస్తే బల్బు వెలిగిన రీతిలో.. పట్టాభి ప్రెస్ మీట్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీకి చెందిన వారుగా భావిస్తున్న పలువురు దాడులకు పాల్పడుతున్నట్లుగా టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
మొత్తంగా అల్లరిమూకల దాడులతో ఏపీలో రాజకీయ అలజడి చోటుచేసుకోవటంతోపాటు.. తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. విచిత్రమైన విషయం ఏమంటే.. పలుచోట్ల పార్టీ కార్యాలయాల మీద దాడి జరిగితే..కొన్నిచోట్ల మాత్రం టీడీపీకి చెందిన నేతల ఇళ్లను టార్గెట్ చేయటం చర్చనీయాంశమైంది. అనంతపురం జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆఫీస్ పైనా దాడికి పాల్పడిన ఉదంతం కొత్త టెన్షన్ కు కారణమైంది.
ఆయన ఆఫీస్ మీదకు వైసీపీకి చెందిన వారు దాడులకు పాల్పడినట్లుగా చెబుతున్నారు.పట్టాభి ప్రెస్ మీట్ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల దాడులు జరిగితే.. అందులో బాలకృష్ణ ఆఫీస్ కూడా ఉండటం గమనార్హం. పెద్ద ఎత్తున ఆఫీస్ మీదకు వచ్చిన వారు దాడులకు పాల్పడినట్లుగా చెబుతున్నారు. హిందూపురానికి బుధవారం రావాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే.. హిందూపురంలో హైటెన్షన్ చోటు చేసుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. హిందుపురంలోని టీడీపీ ఆఫీసు మీద కూడా దాడి జరిగినట్లుగా తెలుస్తోంది.