నైజీరియాలో చర్చిపై ఉగ్రదాడి.. 50 మందికి పైగా చంపేశారు

Update: 2022-06-06 04:31 GMT
దారుణ ఉగ్రఘటన చోటు చేసుకుంది. దొరికిన వారిని దొరికినట్లుగా చంపేసిన అమానుష ఉదంతం నైజీరియాలో చోటు చేసుకుంది. ఓవైపు కాల్పులు.. మరోవైపు బాంబు పేలుళ్లతో చర్చిలో మారణహోమాన్ని క్రియేట్ చేశారు. ఈ సందర్భంగా అమాయకులైన పలువురు మరణించారు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద ఉగ్రదాడి జరిగింది లేదన్న మాట వినిపిస్తోంది.

ఈ దాడిలో మరణించిన వారిలో స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు. నైజీరియాలోని ఒండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఆదివారం కావటంతో పెద్ద ఎత్తున క్రైస్తవులు చర్చిలో ప్రార్థనల కోసం విచ్చేశారు. చర్చి ప్రధాన పాస్టర్ ను ఉగ్రవాదులు ముందుగా కిడ్నాప్ చేశారు. అనంతరం  మారణహోమానికి తెర తీశారు. కనిపించిన వారిని కనిపించినట్లుగా కాల్చేశారు.

ఈ మారణ కాండలో 50 మంది వరకు మరణించగా.. మరింత మంది గాయాల బారిన పడ్డారు. మరణించిన వారి సంఖ్య మరింత పెరగొచ్చన్న మాట వినిపిస్తోంది.

ఈ కాల్పుల ఉదంతంలో గాయపడిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఉగ్రఘటనలో స్థానిక ఎమ్మెల్యేను కూడా చనిపోయారు.

మహిళలు.. చిన్నారుల మృతదేహాలు పెద్ద ఎత్తున చెల్లాచెదురుగా పడి ఉండటంతో పాటు.. ఆ ప్రాంగణమంతా రక్తపు మడుగులా తయారైంది. దీంతో.. సదరు ప్రార్థనాలయంలో భయానకంగా మారింది.
Tags:    

Similar News