మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసులో దోషిగా నిరూపితమై.. చచ్చేవరకూ జైల్లో ఉండేలా యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్న ఆశారాం బాపుకు చెందిన ఆడియో క్లిప్ ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. తాను జైలు నుంచి బయటకు వచ్చే విషయంలో ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. ఈ ఆడియో క్లిప్ ఎలా బయటకు వచ్చిందన్నది ప్రశ్నగా మారింది.
ప్రస్తుతం యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్న ఆశారాం జైలు నుంచి తన సన్నిహితులతో ఫోన్లో మాట్లాడారు. జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి నెలకు 80 నిమిషాల పాటు మాట్లాడే వీలుంది. అది కూడా.. రెండు నెంబర్లకే ఫోన్ చేసే వెసులుబాటు ఉంటుంది. ఇందులో భాగంగా ఆశారాం ఫోన్ మాట్లాడగా.. ఎవరో ఆయన ఫోన్ కాల్ ను రికార్డు చేసి.. ఆడియో క్లిప్ ను బయటపెట్టారు. ఇక.. ఆశారాం ఫోన్ సంబాషణ చూస్తే.. తాను త్వరలోనే జైలు బయటకు వస్తానన్న మాటను ఆశారాం చెప్పటం కనిపించింది. తనకు జైలు నుంచి విముక్తి లభిస్తుందన్న ఆశతో ఉన్నట్లు చెప్పారు.
అయితే.. ఈ ఆడియో క్లిప్ వ్యవహారంపై జోధ్ పూర్ జైళ్ల శాఖ డీఐజీ విక్రం సింగ్ స్పందిస్తూ.. ఆశారాం ఫోన్ మాట్లాడే సమయంలో రికార్డు చేసి ఉంటారన్నారు. ఇదిలా ఉంటే.. తన అనుచరులతో మాట్లాడిన సందర్భంగా ఆశారాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు.. మరికొందరికి జైలుశిక్ష విధించటంపైనా స్పందించి.. వారిని ఏదో విధంగా
జైలు నుంచి బయటకు తీసుకొస్తానని.. అందుకు అవసరమైన న్యాయసాయాన్ని అందేలా చేస్తానని చెప్పారు.
జైల్లో ఉన్న వారు తన పిల్లలని.. వారి బాధ్యతలు చూడాల్సింది ఇంటి పెద్దే కదా? అన్న ఆయన.. అవసరమైతే మరికొంతమంది న్యాయవాదుల్ని రంగంలోకి దించి వారిని విడుదల అయ్యేలా చేస్తానని చెప్పటం సదరు ఆడియో లో ఉంది. తొలుత వారు జైలు నుంచి వచ్చిన తర్వాతే.. తాను బయటకు వస్తానని ఆశారాం చెప్పటం గమనార్హం.
వీడియో చూడటానికి క్లిక్ చేయండి
Full View