మాములుగా స్టేడియంలో క్రికెట్ ఆడే ప్లేయర్స్ ఎనర్జీ కోసం ఎక్స్ట్రా ప్లేయర్స్ మధ్య మధ్యలో వారికీ డ్రింక్స్ ఇస్తూ ఉంటారు. డ్రింక్స్ బ్రేక్ సమయంలో కానీ , ఓవర్ కి ఓవర్ కి మధ్యలో గ్రౌండ్ లోకి మెరుపు వేగంతో వచ్చి డ్రింక్స్ ఇచ్చి మళ్ళీ గ్రౌండ్ బయటకి పరుగెత్తుతూ ఉంటారు.కానీ , తాజగా ఆస్ట్రేలియా ప్లేయర్స్ కోసం ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ వాటర్ బాయ్ గా మారాడు.
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం లసిత్ మలింగ ఆద్వర్యంలోని శ్రీలంక జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఆదివారం అడిలైడ్ వేదికగా మొదలుకానున్న తొలి టీ20 మ్యాచ్ కోసం ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రైమ్ మినిస్టర్ XI- లంక జట్లు గురువారం వార్మప్ మ్యాచ్‌లో తలపడ్డాయి.
వార్మప్ మ్యాచ్ కాన్‌బెర్రాలోని ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో లంక ఆటగాళ్లు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో... ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ఒక్కసారిగా మైదానంలోకి పరుగెత్తుకు వచ్చారు. మ్యాచ్ 16వ ఓవర్‌లో తమ క్రికెటర్ల కోసం వాటర్ బాటిల్స్ తీసుకువచ్చారు. ఊహించని ఈ పరిణామంతో ఆసీస్ ఆటగాళ్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆసీస్ క్రికెట్ జట్టు క్యాప్‌ను ధరించి మైదానంలోకి రావడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు గ్రేట్ సార్... హాట్సాఫ్ అంటూ నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.