యువతి మెదడులో పొడవైన పురుగు..చూసి డాక్టర్లే షాక్ అయ్యారు!

Update: 2020-10-07 23:30 GMT
మనిషి మెదడులో పురుగు ఉంటుందని చాలామంది అంటారు. అయితే, అది పుట్టుక నుంచి ఉంటుందో లేదో తెలీదుగానీ, అపరిశుభ్రమైన ఆహారం తీసుకుంటే మాత్రం తప్పకుండా మెదడులో పురుగులు పెరుగుతాయ్. ఇందుకు ఈ మహిళే నిదర్శనం. ఎందుకంటే.. వైద్యులు ఈమె మెదడు నుంచి పొడవైన పురుగును బయటకు తీశారు. ఆ పురుగును చూసి డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. గత ఏడేళ్లుగా మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతోంది 25ఏళ్ల భరిస్తా అనే ఓ మహిళ. నెలలో మూడుసార్లు తీవ్ర స్థాయిలో తలనొప్పి వస్తుండేది. ఒకసారి తలనొప్పి వారానికి పైగా తీవ్రంగా బాధించింది. అంతేకాదు.. కళ్లు మసకబారడం, తలనొప్పి కంటిన్యూగా వస్తూనే ఉంది. దాంతో భయపడిన మహిళ వెంటనే ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి వైద్యులు మెదడులో ఏమైనా ట్యుమర్ ఉందేమోనని ఎంఆర్ ఐ స్కానింగ్ చేశారు. మెదడులో ట్యుమర్ తొలగించేందుకు సర్జన్లు ప్రయత్నించారు.

కానీ, మెదడులో అతిపెద్ద పురుగు లార్వాను చూడగానే షాక్ అయ్యారు. వెంటనే శస్త్ర చికిత్స ద్వారా మెదడులోని పురుగును బయటకు తీశారు. సాధారణంగా ఇలాంటి పురుగులు మనిషిలోని ప్రేగుల్లో జీవిస్తుంటాయి. సరిగా ఊడకించని పంది మాంసాన్ని తినడం ద్వారా ఈ పురుగు శరీరంలోకి ప్రవేశిస్తుంది. లేదంటే పురుగు గుడ్లను తినడం ద్వారా కూడా లోపలికి ప్రవేశించే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాలో ఈ తరహా మొట్టమొదటి స్థానిక కేసుగా గుర్తించారు. ప్రస్తుతం బాధిత మహిళ పూర్తిగా కోలుకుంది.. మరో ట్రీట్ మెంట్ అవసరం లేదని డాక్టర్లు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా టేప్ వార్న్ ఇన్ఫెక్షన్ల కారణంగా మనుషుల్లోని మెదడు వంటి కేంద్ర నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడి మూర్ఛకు దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.
Tags:    

Similar News