చైనాలో మళ్లీ కరోనా కల్లోలం..ఆ విమానాశ్రయం లో 7 మందికి పాజిటివ్ సర్వీసులు రద్దు!

Update: 2020-11-25 01:30 GMT
కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి దెబ్బకి మొత్తం ప్రపంచమే వణికిపోయింది. ఈ వైరస్ వెలుగులోకి వచ్చి నెలలు గడుసున్నా కూడా ఇప్పటికి ఎంత మాత్రం తగ్గలేదు. ఇక తాజాగా కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో మరోసారి ఈ వైరస్ విజృంభిస్తోంది. ఈ కారణంగా చైనాలోని అత్యంత రద్దీ అయిన ఎయిర్‌ పోర్టుల్లో ఒకటైన పుడాంగ్ లో విమాన సర్వీసులను రద్దు చేశారు. రెండో విడత కరోనా వ్యాప్తిలో భాగంగా షాంఘై ప్రాంతంలో ఇటీవల ఏడుగురికి కరోనా పాజిటివ్ గా తేలింది. వీరంతా కూడా ఎయిర్‌ పోర్టు సిబ్బంది కాంటాక్ట్ కారణంగా కరోనా సోకినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయంలో విమానాశ్రయంలో వైమానిక సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆ దేశ విమానయాన శాఖ ఓ ప్రకటన జారీచేసింది. అలాగే, విమానశ్రయంలో పనిచేస్తున్న వేలాదిమంది సిబ్బందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఇప్పటివరకు 17,700మందికి కరోనా స్వాబ్ టెస్టులు చేసినట్లు అధికారులు తెలిపారు. మొదటగా గత ఏడాది చివర్లో వుహాన్ నగరంలో మొదలైన కరోనా వైరస్ ఆ తర్వాత కొంచెం కొంచెం గా ప్రపంచం మొత్తం విస్తరించింది. దీనితో చైనాతో సహా అన్ని ప్రాంతాల్లోనూ లాక్ ‌డౌన్‌ లు, ప్రయాణాలపై ఆంక్షలు విధించడం జరిగింది. కట్టుదిట్టమైన నియంత్రణ చర్యల కారణంగా కరోనా వైరస్ ‌ను చైనా చాలా వరకు నియంత్రించింది. రెండో విడతలో మళ్లీ వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ఇక్కడ కరోనా క్లస్టర్ కనిపించింది.
Tags:    

Similar News