అయోధ్య లో రామజన్మ భూమికి సంబంధించిన చరిత్రాత్మక వాస్తవాలు, విశేషాలను తెలిపే టైమ్ క్యాప్స్యూల్ ను ఆలయ నిర్మాణ స్థలి కింద సుమారు రెండు వేల అడుగుల లోతున ఉంచనున్నారని, దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి వివాదం తలెత్తదని రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ తెలిపారు. రామజన్మ భూమి వివాదంపై సుప్రీంకోర్టులో దీర్ఘకాలం కొనసాగిన కేసు..ప్రస్తుత, రానున్న తరాలకు ఓ గుణపాఠం అవుతుంది అని ఆయన అన్నారు. అయితే , అయోధ్యలో రామాలయం కింద టైమ్ క్యాప్స్యూల్ పెట్టడం లేదని, టైమ్ క్యాప్స్యూల్ పెడుతున్నట్టు వస్తున్నా వార్తలన్నీ పుకార్లేనని, ఫేక్ న్యూస్ ను ప్రజలు నమ్మొద్దని ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ మంగళవారం క్లారిటీ ఇచ్చారు.
రామ మందిరం అడుగున టైమ్ క్యాప్సుల్ ఏర్పాటు చేయబోతున్నట్టు ట్రస్టు సభ్యుడి ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే ఆ వార్త విపరీతంగా వైరల్ అయింది. దేశంలోని చిన్నా, పెద్దా మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో ఈ వార్తలు విపరీతంగా షేర్ అయింది. అసలు ఈవెంట్ కంటే టైమ్ క్యాప్సుల్ వ్యవహారం చర్చనీయాంశం కావడంతో రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు క్లారిటీ ఇచ్చింది. ట్రస్టు సెక్రటరీ చంపత్ రాయ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కామేశ్వర్ చౌపాల్ ప్రకటనతో విభేదించారు. ఆలయానికి సంబంధించి అనధికారికంగా వెలువడే ప్రకటనలని ప్రజలు నమ్మొద్దని, అడుగు భాగంలో ఎలాంటి టైమ్ క్యాప్సుల్ ఏర్పాటు చేయబోవడంలేదని వెల్లడించారు.
దాదాపు రూ.500 కోట్ల భారీ వ్యయంతో అయోధ్యలో నిర్మించదలచిన రామ మందిరం కొత్త డిజైన్ కు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఈ నెల 18న ఆమోదం తెలిపింది. 161 అడుగుల ఎత్తులో నిర్మించనున్న ఈ రామమందిరానికి అదనంగా మరో మూడు మంటపాలనూ ఏర్పాటు చేస్తామని, మొత్తం 366 స్తంభాలను వాడుతామని ప్రధాన శిల్పి సీఎస్ సోంపూరా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా, ఆగస్టు 5న అయోధ్య భూమి పూజ జరుగనుంది. ఈ కార్యక్రమానికి సుమారుగా 200 మంది ప్రముఖులు హాజరుకాబోతున్నారు.