ప్రస్తుతం దేశంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకవైపు వైరస్.. మరోవైపు సరిహద్దులో ఆందోళనకర పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో రామమందిర నిర్మాణం చేయడం తగదని హిందూ సంస్థలు భావిస్తున్నాయి. దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఈ సమయంలో ఆలయ నిర్మాణ పనులు మొదలుపెట్టడం సరికాదంటూ ఆ సంస్థ నిర్ణయించాయి. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పనులు తాత్కాలికంగా వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. గాల్వన్ లోయ ప్రాంతంలో చైనా ఘాతుకాన్ని నిరసిస్తూ అయోధ్యలో హిందూ సంస్థలు (హిందూ మహాసభ, విశ్వ హిందూ పరిషత్) ఆందోళనలు చేస్తున్నాయి. చైనా తీరును ఖండిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.
ఈ నేపథ్యంలో రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. వీర మరణం పొందిన జవాన్లకు నివాళి అర్పిస్తూ అయోధ్య రామమందిర నిర్మాణాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశానికి మద్దతుగా నిలబడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనిపై ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా మీడియాతో మాట్లాడారు. దేశ పరిస్థితులకు అనుగుణంగా మందిర నిర్మాణ ప్రారంభ ప్రక్రియ విషయంలో తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పనులు ప్రారంభించే తేదీని త్వరలోనే ప్రకటన చేస్తామని పేర్కొన్నారు.